ఒకటి
కలిసికట్టుగా...
మానవ లక్షణం : సంబంధం
హరీష్ సుశిక్షితుడైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతను బెంగుళూరులో ఒక ప్రసిద్ధ IT సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను విలాసవంతమైన భవనంలో నివసిస్తాడు. ఆ భవనం చుట్టూ పచ్చదనం. రెండువైపులా రెండు సరస్సులు. అతను ఆధ్యాత్మిక అన్వేషణలో ఉత్సుకుడు. ఒక ఉపదేశకుల శిక్షణలో పాల్గొనే బృందంలో అతను కూడా సభ్యుడు, సత్సంగాలలో ఆధ్యాత్మిక విషయాలు చర్చించుతూ ఉండేవారు. హరీష్ ఈ సమావేశాలలో చురుకుగా పాల్గొనేవాడు. ఇటీవల అతను సత్సంగాలలో పాల్గొనటం మానేశాడు. కారణం ఏమిటో తెలియదు. కొన్ని వారాలు గడిచాయి. ఆ రాత్రి చలి ఎముకలు కొరికివేస్తున్నది. ఆరాత్రి ఆ బృందనాయకుడు మోహన్ హరీష్ ను కలుసుకోవాలని నిశ్చయించారు. హరీష్ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. చలిమంట కెదురుగా కూర్చొని ఉన్నాడు. మంట ధగధగా మండుతున్నది.
మొదట్లో ఇష్టం లేకపోయినా, మర్యాదకొద్దీ హరీష్ వెళ్లి తలుపు | తెరిచి మోహన్ ను లోపలికి ఆహ్వానించాడు. వారు ఇద్దరూ ఒకరినొకరు చూసి నవ్వుతూ ఉల్లాసంగా కబుర్లాడుకున్నారు. ఆ తర్వాత కొంతసేపు దద్దరిల్లే నిశ్శబ్దం రాజ్యం చేసింది. ఇలకోళ్ళు, మిడతలు, కీచురాళ్ళ సంగీత సామ్రాజ్యం రాజ్యం చేసింది కొంతసేపు. అది హరీష్ ను మరింత ఇరకాట పెట్టింది. సంభాషణ తనే మొదలు పెట్టాలా, లేకపోతే హరీష్ కదిలించినదాక వేచి ఉండాలా అని సందిగ్ధంలో ఉన్నాడు మోహన్. చలిమంట నాట్యం గమనిస్తూ కొంత కాల వెళ్ళదీశారు ఇద్దరూ. ఆ నెగడులో మంటలు చిటపట లాడాయి. నిశ్శబ్దంగా మరికొన్ని నిమిషాలు గడిచాయి................