• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Eku Daram

Eku Daram By Dr B Naga Seshu

₹ 400

ఏకదారం
 

(చేతివృత్తుల సంతకం)

ఎర్రపూలమారెమ్మ

మధ్యాన్నం ఎండతో ముఖంకడుక్కోని, గాలిని గంధంగా రాసుకుని, డబ్బాపూలను అబ్బురంగా అలంకరించుకుని, వూరందరి ఉత్సాహం కోసం ప్రతిఏడాది జరుపుకునే వుత్తుత్తి ఎర్రిపూల మారెమ్మ వూరేగింపు సందులంటీ జరుగుతా ఉంది. చిన్నా, పెద్దా, పిల్లా, పిసకా, ముసలి, ముతక కేరింతలతో ఎగురుకుంటూ, కునుసుకుంటూ మారెమ్మ వెంట వస్తున్నారు.

ఉగాది పండుగ అయిపోయినంక పాడ్యమినాడు ఎర్రిపూలమారెమ్మ ఊరేగింపు ఉంటేనే, లేదంటే వూరిజనానికి ఖుషీ ఉండదు. ఉగాది పండుగకు వూపుతెచ్చేది ఈ ఎర్రిపూలమారెమ్మ వూరేగింపే. ఐస్కెండ్ పెట్టాకట్లుండేదాంట్లో మూడుముఖాల రాయికి, కుంకుమ, పసుపుపూసి ఆ రాయికి చుట్టూ యాపాకు పందిరి వేసినారు. ఊదికడ్ల ఊసుగాని, టెంకాయల శంకగాని, వారాలవంచనకాని, ముహూర్తాల ముచ్చటగాని వుండవు ఈ మారెమ్మకు. మడి, గుడి, ఆచార, అనాచారాల ఆలోచనల జోలికేపోరు. కేవలం మనుషుల చింతతనాన్నిపోగొట్టి వినోదాన్ని పంచుతూ ఉరేగే వింత దేవత.

నర్సయ్య నెత్తిమీద ఎర్రిపూలమారెమ్మ పెట్టెను మోస్తున్నాడు, పాలప్ప భుజంమీద చాటీ వేసుకున్నాడు. కానుకలు, దక్షిణలులేని పూజారితనాన్ని బోగినాగయ్యకు అప్పజెప్పినారు. పక్కకు పడేసిండే పాతనూనె డబ్బాలకు తూట్లుపొడిసి ఆ బొక్కల్లోకి ట్రైన్ పురిదూర్చి మెడలో ఉరాలుగా తగిలేసుకుని ఓబులపతి, డక్కీవోడు, కుంటిరంగయ్య, బక్కరెడ్డి, కాటమయ్య డడ్డేవ్, డడ్డేవ్ అంటూ దరువేస్తున్నారు. నరసయ్యకు బని, నిక్కరు మీదే చీరకట్టినారు,.........................

  • Title :Eku Daram
  • Author :Dr B Naga Seshu
  • Publisher :Dr B Naga Seshu
  • ISBN :MANIMN5857
  • Binding :Hard Binding
  • Published Date :2024
  • Number Of Pages :367
  • Language :Telugu
  • Availability :instock