పేరు
రుష్యేంద్రమణి”
వరుసగా కొన్ని తలలు నావైపు తిరిగి చూశాయి. నాకు అలవాటే. మా అమ్మమ్మ తన కాలం నటిమీద అభిమానంతో ఈ పేరు పెట్టిందట. ఆవిడ తరువాత ఎవరూ ఈ పేరు పెట్టుకోకపోవడం నాకు ఆశ్చర్యం వేస్తుంది. కొంచెం చిరాకు కూడా వేస్తుంది. అందరూ నా పేరు చెప్పినప్పుడల్లా ఇలా చూడ్డం.
మా తెలుగు పండిట్ సీతారామశాస్త్రిగారు “ఋ" అది రుష్యేంద్రమణి కాదు. ఋష్యేంద్రమణి అని బ్లాక్ బోర్డ్ మీద రాసి చూపించి చెప్పేవారు. ఆ 'ఋ' ఇప్పుడు లేదు. అక్షరమాలలోనే లేదు. నా పేరులో మొదటి అక్షరంలా నా లైఫ్ ఎంతో నిరర్ధకం అయిపోయినట్లు నాకు అనిపిస్తోంది. మనిషి జీవితం, మన పూర్వీకులు చెప్పినట్లు వందేళ్ళు కాదు, ఇప్పటి రోజుల్లో యాభై.. కాదులే.. అరవై అనుకుంటే, నేను అందులో సగం నిరర్ధకంగా గడిపేశాను.
జబ్బమీద నొప్పి. ఒక్క సెకన్, నాకు నర్స్ బూస్టర్ షాట్ ఇచ్చింది. ఆ ప్లేస్లో మెత్తని దూది అద్ది, ఒక్క ఫ్లాస్టర్ వేసింది. నేను థాంక్స్ సగం చెప్తుండగానే “నెక్స్ట్” అంది. ఆ అమ్మాయికి పాతికలోపే వుండచ్చు. కానీ ఇప్పటికే చాలా విసిగి వేసారిపోయినట్లు, మొనాటనస్ వాయిస్తో, రొటీన్గా పనిచేస్తూ ఏదో పోగొట్టుకున్నట్లుగా వుంది.
ఏదో కాదు, నువ్వు పోగొట్టుకున్నట్లుగా వుంది. నేను నా కుర్తీ స్లీవ్ కిందకి చేసుకునికూడా ఇంకా లేవకపోవడంతో నావైపు విసుగ్గా కూడా కాదు నిస్తేజంగా చూసింది.
నేను నవ్వాను. స్నేహపూర్వకంగా నవ్వి “గుడ్ షాట్.. అసలు చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు నాకు” అన్నాను.
ఆమె తల వూపింది. నుదుటి మీద వున్న మూడు గీతల్లో, రెండు క్లియర్ అయి, ప్రశాంతంగా చూసింది. "మీ పేరు కూడా బావుంది" ఆమె ఎడమ చేతివైపు పెట్టుకున్న నేమ్ బ్యాడ్జ్ చూసి చెప్పాను. ఆమె పేరు 'జాస్మిన్', ఆమె పెదవులు బద్దకంగా విడివడి, అలవాటు లేని పని చేస్తున్నట్లు చిన్నగా నవ్వి 'థాంక్స్' అన్నాయి. అనిపించింది. 'ఎస్' ఆమె మొహంలో నవ్వు చూసాను. అది ఎంతో బావుంది. ఓ చిన్న అప్రిసియేషన్, చిన్న మెప్పుకోలు ఇంతగా మనిషిని స్పందింప చేస్తాయా?
నాకెంతో సంతోషంగా...........................