• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Enduku Tho Modalu
₹ 399

ఉపోద్ఘాతం

‘ఎందుకు’ లో దాగి ఉన్న శక్తి

నా జీవితంలో అవసరమైన సమయంలో సరిగ్గా ఈ 'ఎందుకు' ఎదురయింది. అది అధ్యయనంలోనో మానసిక క్షేత్రంలోనో జరిగిన పరిశోధన కాదు. నేను చేస్తున్న పనిమీద నాకు ఆసక్తి నశించింది. నా చుట్టూ చీకటి అలుముకున్నది. నేను చేసే పనిలోనూ, నా ఉద్యోగంలోనూ ఏ లోపమూ లేదు. ఆ పనిచేయటంలో ఆనందాన్ని కోల్పోయాను. బయటికి కనిపించే పరిస్థితులు చూస్తే నేను ఆనందంగానే ఉన్నానని చెప్పాలి. నా జీతం బాగున్నది. నా ఖాతాదారులందరూ చాలా మంచివాళ్ళు. కానీ అందులో నాకు ఆనందము. తృప్తి కలగటంలేదు. ఒక మంచి ఉద్యోగం చేస్తున్న సంతృప్తి, అనుభూతి నాకు కలగటం లేదు. పనిపట్ల అనురక్తి, పాశము నాలో మరొకసారి కళ్ళు తెరవాలి.

ఈ ఎందుకు కనుక్కున్న తర్వాత ఈ ప్రపంచం పట్ల నా దృక్పధం పూర్తిగా మారిపోయింది. 'ఎందుకు' కనుక్కున్న తర్వాత నా అనురక్తి. పాశము ఎప్పటికంటే ఎన్నోరెట్లు పెరిగాయి. అది అతి సరళం, శక్తివంతం, ఆచరణాత్మకం కూడా. కనుకనే వెంటనే నా స్నేహితులందరికీ చెప్పేశాను. అంతేగదా మరి! విలువైన విషయం ఏదైనా తెలియగానే మన సన్నిహితులతో చెప్పుకుంటాం. ఆ ఉత్తేజంతో నా మిత్రుల జీవితాలే మారిపోసాగాయి, ఆ కారణంగా నా మిత్రులందరూ వచ్చి ఆ రహస్యాన్ని తమ సన్నిహితులందరికీ చెప్పమని అడిగారు. అలా ఆ భావన విస్తరించసాగింది.............

  • Title :Enduku Tho Modalu
  • Author :Simon Sinek , Garnepudi Radha Krishna Murthy
  • Publisher :Manjul Pablication House
  • ISBN :MANIMN3776
  • Binding :Papar back
  • Published Date :2022
  • Number Of Pages :281
  • Language :Telugu
  • Availability :instock