ALPHABET ఆల్ఫబెట్
వర్ణమాల - పదాల పరిచయం
ఇంగ్లీషులో రాయడానికి ఇంగ్లీషు అక్షరాల్ని గుర్తుపట్టాలి. కాబట్టి మొదటగా -ఇంగ్లీషు అక్షరాలతో పరిచయం చేసుకుందాం. -
తెలుగులో మనకి ఏ విధంగా అక్షరాలున్నాయో, ఇంగ్లీషులో కూడా అక్షరాలు న్నాయి. తెలుగులోగాని ఇంగ్లీషులోగాని, కొన్ని అక్షరాలు కలిస్తే ఒక పదం అవుతుంది. కొన్ని పదాలు కలిస్తే ఒక వాక్యం అవుతుంది. ఇంగ్లీషులో అక్షరాల్ని Alphabet (ఆల్ఫబెట్) అంటారు. తెలుగులో వర్ణమాల అంటారు.
'తెలుగులో అ, ఆ, ఇ, ఈ మొదలైన అక్షరాలుంటే ఇంగ్లీషులో A, B, C, D అనే అక్షరాలున్నాయి.
ఇంగ్లీషులో 26 అక్షరాలున్నాయి. ఇవి 4 రకాలు. అచ్చువేయడానికి రెండు | రకాలు, రాయడానికి రెండు రకాలు ఉన్నాయి. అచ్చులో రకాలు: 1. పెద్దవి: A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
2 చిన్నవి : a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z