ఈ పుస్తకాన్ని రచించిన ఐ వై ఆర్ కృష్ణారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను విభజన తరువాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను చాలా ముఖ్యమైన ఉన్నత స్థానాలలో పనిచేశారు. ఆయన పదవీవిరమణ సమయానికి రాష్ట్రప్రధాన కార్యదర్శిగా రాష్ట్రంలోని సివిల్ సర్వీసెస్ కు నాయకత్వం వహించారు. అందువల్ల ప్రభుత్వంలో అంతర్గతంగా నిర్ణయాలు తీసుకునే పద్ధతులను అతిసమీపంనుండి ఆయన చూడగలిగారు. ప్రజలకు ఇటువంటి దృక్కోణం అందుబాటులోనికి రావడం చాలా అరుదు. ఆయన ఈ పుస్తకంలో చెప్పిన విషయాలు, బహిరంగ పరచిన విషయాలు చాలా విలువైనవి. అందువల్ల వాటిని అంతే గంభీరంగా చదివి అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.
'ఎవరి రాజధాని అమరావతి?' అన్న ఐ వై ఆర్ కృష్ణారావు విశ్లేషణాత్మక రచనను సాధ్యమైనంత మంది ఆంధ్రప్రదేశ్ లోనే దాని వెలుపలా కూడా చదవాలని నా కోరిక. అది అమరావతిని ఎలా ప్రణాళికీకరించారు. భవిష్యత్తులో ప్రజలపై దాని ప్రభావం ఎలా ఉంటుంది. అన్న విషయాలపై ఈ గ్రంథం లోతైన పరిశీలనను అందిస్తున్నది.
- ఇ ఎ ఎస్ శర్మ