పీఠిక
శూద్రులపై పుస్తకం రాయడం- పసలేని పనిగానో, లేక పనిలేని పాటగానో భావించడానికి ఆస్కారం లేదు. ఈ అంశంపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాహిత్యాన్ని పరిశీలిస్తే ఇది అర్థం అవుతుంది. ఇండో ఆర్యుల వ్యవస్థలో.. సామాజిక వర్గీకరణ చాతుర్వర్ణ సిద్ధాంతంపై రూపు దిద్దుకున్న విషయం తెలిసిందే. చాతుర్వర్ణ సిద్దాంతం అంటే- బ్రాహ్మణులు (పూజారులు), క్షత్రియులు (సైనికులు), వైశ్యులు (వ్యాపారులు), శూద్రులు (సేవకులు). అయితే శూద్ర సమస్యల నిజ స్వరూపాన్నిగానీ, లేదా సమస్యల తీవ్రతనుగానీ ఇది చెప్పదు. చాతుర్వర్ణ సిద్ధాంతం సమాజాన్ని కేవలం నాలుగు వర్గాలుగా విభజించడం మాత్రమే అయివుంటే, అది ఏమాత్రం ప్రాధాన్యం లేని సూత్రీకరణగా మిగిలిపోయేది. దురదృష్టవశాత్తూ చాతుర్వర్ణ సిద్ధాంతం లోపల ఇంతకు మించినదే ఉంది. సమాజాన్ని నాలుగు వర్ణాలుగా విభజించడంతోపాటు ఈ సిద్ధాంతం మరింత ముందుకు పోయి అంతరాలతో కూడిన అసమానత్వ సూత్రాన్ని తెచ్చిపెట్టింది. నాలుగు వర్ణాల మధ్య సంబంధాలు ఎలా ఉండాలన్నదానికి ఇదే ప్రాతిపదిక అయింది. పైగా, ఈ అంతరాలతో కూడిన అసమానత్వ విధానం ఊహాజనితమైనదేమీ కాదు, దానికి పూర్తి చట్టబద్ధత, శిక్షలూ ఉన్నాయి.
చాతుర్వర్ణ వ్యవస్థలోని నాలుగు అంచెల్లో శూద్రుడిని కింది అంచెలో ఉంచడంతోపాటు, చట్ట ప్రకారం నిర్దేశించిన స్థాయి నుంచి అతను పైకి వెళ్లకుండా నిరోధించేందుకు ఎన్నో ప్రతిబంధకాలనూ, సామాజిక అవమానాలనూ రూపొందించారు. నిజానికి పంచమ వర్ణంగా అంటరానివారు వచ్చే వరకూ హిందువుల దృష్టిలో శూద్రులు - పూర్తిగా అట్టడుగు కులమే. శూద్ర కుల సమస్య నిజ స్వరూపాన్ని ఇది ఆవిష్కరిస్తున్నది. సమస్య తీవ్రత తెలియకపోవడానికి కారణం అసలు శూద్రులు ఎవరు అన్న కోణంలో వారు ఆలోచన చేయకపోవడమే. దురదృష్టవశాత్తూ జనాభాలో వీళ్లను విడిగా చూపించకపోవడమూ మరో కారణం. అంటరాని కులాల్ని మినహాయిస్తే, హిందూ జనాభాలో శూద్రుల సంఖ్య 75 నుంచి.....................