ఎవరికీ చెప్పక!
There are two ingredients for deception. A good bit of truth and a few little lies.
- Billy Graham
ఆమె కళ్ళముందే ఆ తల్వార్ గాల్లోకి లేచింది. ఆమె చూస్తూండగానే అది కబీర్ మెడని తాకింది. తాకీ తాకగానే రక్తం నిరతి ఒంటిమీదకి చిందింది. కబీర్ కెవ్వున అరిచాడు. కానీ ఆ కేక సగంలోనే ఆగిపోయింది.
అతని తల తెగి మెడనించి వెనక్కి వేలాడింది. కొద్దిక్షణాలపాటే. తర్వాత తల బరువుకి చర్మం చిరిగి కబీర్ తల పూర్తిగా తెగి కిందపడి నిరతి కాళ్ళ దగ్గరికి దొర్లింది. కబీర్ మొండెం నిరతి మీదకి వాలిపోయింది.
"నిరతీ! వస్తున్నా ఉండు." ఆమె భర్త కాశ్యప్ గొంతు వినిపించింది.
కాశ్యప్ హిస్టీరికల్గా ఏడుస్తున్న నిరతి చేతిని తన చేత్తో పట్టుకున్నాడు. జరిగిన
ఘోరం చూసాడు.
"పారిపోదాం.” కంగారుగా చెప్పాడు.
దాద్దామని ప్రయత్నించినా దాగని భయం కాశ్యప్ మాటల్లో బయటపడింది. ఉర్దూలో, తెలుగులో, ఇంగ్లీష్ లో అరుపులు, కేకలు. నిరతి, కాశ్యప్ అందరినీ తప్పించుకుంటూ పరిగెత్తుతున్నారు. ఎవరో ఆపి హిందీలో అడిగారు..................