ఎవరితో ఎలా మాట్లాడాలి?
(రామాయణంలో హనుమంతుడు)
జంతువులకి లేనిదీ, మానవుడికి దైవం అనుగ్రహించినదీ వాక్కు మనలోని ఆలోచనలనీ, భావాలనీ వ్యక్తం చేసుకోగల శక్తి వాక్కులో ఉన్నది. ఈ వాక్యక్తిని సద్వినియోగ పర్చుకోవడంలోనే మనిషి గొప్పతనం ఉన్నది. ఒక మాట మాట్లాడడానికి ముందు ఆలోచించి ఏ పదాలు అవసరం, ఏ పదాలు అనవసరం, ఏ మాటలు ఎదుటి మనిషికి మన మనసులోని భావాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి, ఏ మాటలు అపార్థాలకి దారితీస్తాయి, ఏ పదాలు వాడడం వలన, భావం వ్యక్తం అవ్వడమే కాక మనోరంజకంగా ఉంటుంది అనే విషయాన్ని ఆలోచించి, మాట్లాడడం ఎలా అనే అంశాన్ని సాధన చేసినట్లయితే వారికి తిరుగులేదు అని నిరూపించాడు రామాయణంలో హనుమంతుడు.
రామాయణంలో హనుమంతుణ్ణి ఎరిగిన వారు చాలా తక్కువగా ఉంటారు. రామాయణం చదివిన వారిలో, వ్యాఖ్యాతలలో, భాష్యకారులలో అనేకుల దృష్టిలో హనుమంతుడు రామభక్తుడు.
రామనామం చెవిని పడగానే తలవంచి ఆనందబాష్పాలు విడిచే హనుమంతుని ఎరిగినవారు అసంఖ్యాకులు. వాల్మీకి రామాయణంలో ఉన్న రామదూత హనుమంతుడు, తలవంచి బాష్పాలు వదిలేవాడు కాదు.
రావణుని పది తలలు వంచి కంటతడి పెట్టించగల ధీరుడు, భీమంతుడు. అటువంటి హనుమంతుడు రామాయణంలో సాక్షాత్కరిస్తాడు. వైద్య రామాయణంలో హనుమంతుడు....................