• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Evaru
₹ 225

ఇంటర్నేషనల్ మోటార్ కార్ రేసింగ్ ట్రాక్ అంతా కోలాహలంగా ఉంది.

అక్కడ గుమిగూడిన జనం చప్పట్లతో అల్లరితో హోరెత్తి పోతోంది ఆ ప్రాంతమంతా.

అక్కడ మరి కొద్దిసేపట్లో మోటార్ కార్ "ర్యాలీ క్రాస్" ప్రారంభం కాబోతోంది. నెదెర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్ దేశాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఆట "ర్యాలీ క్రాస్," మోటార్ కార్ల రేసుల్లో మొదటి పది స్థానాలలో ఉంటుందా రేస్.

అది చాలా క్లిష్టమైన కార్ రేస్. ట్రాక్ కొంచెం దూరం స్మూత్గా, మరికొంత దూరం మట్టి, బురదతో, మరికొంత దూరం బండలతో ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఎంతో నైపుణ్యం ఉంటే తప్ప ఆ రేస్లో పాల్గొనలేరు. రిస్క్ శాతం కూడా ఎక్కువే. మట్టిలో స్లిప్ అయి ఒకదానినొకటి ఢీకొనే అవకాశాలెక్కువ. ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడవచ్చు. ఆ రాష్ట్రానికి గతంలో ఉన్న ముఖ్యమంత్రికి కార్ల రేస్ పైన ఆసక్తి ఉండడంతో రాజధాని నగర శివార్లలో ఆ రేస్ ట్రాక్ను ఏర్పాటు చేసారు.

ప్రస్తుతం అక్కడ చేరిన జనాలందరి నోట్లోంచి ఒకటే పదం వినబడుతోంది. "దిలావర్ ... దిలావర్..." అని అరుస్తున్నారంతా.

దిలావర్ భారత దేశంలోనే నెంబర్ వన్ కార్ రేసర్. అతడిని స్పాన్సర్ చేస్తున్నది. కూడా చాలా పెద్ద కార్ల కంపెనీ. అక్కడున్న అందరికీ అతనొక హీరో.

రేస్ ప్రారంభం అవడానికి ముందు ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లందరూ దిలావర్ చుట్టూ గుమిగూడారు.

"సార్! ఈసారి సుజిత్ సింగ్, అమిత్ కతియార్ లు పోటీలో ఉంటారంటున్నారు. అనలిస్ట్లు, మీరేమంటారు?" అన్నాడొక రిపోర్టర్........................

  • Title :Evaru
  • Author :Bejjarao Vinod Kumar
  • Publisher :Anvikshiki Publishers
  • ISBN :MANIMN5754
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :187
  • Language :Telugu
  • Availability :instock