• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Evelappudu

Evelappudu By Arasavilli Krishna

₹ 120

                           అరసవిల్లి కృష్ణ మానవ అనుభూతులను, అనుభవాలను వ్యక్తి దగరి నుంచి సమూహం దాకా గరిష్టస్థాయికి తీసికెళతారు. చాలా కర్కశమైన, హింసాత్మకమైన విషయాన్నయినా ఆయన తనలోని భావుకతను చెదరగొట్టుకోకుండా చూస్తారు. చాలా జటిలమైన అనుభవాన్నయినా తన సుతిమెత్తటి భాషతోనే చెప్పడం ఆరంభిస్తారు. తాను కల్లోలానికి గురికాకుండా తనకు అలివి అయిన చోట కవిత్వంమొదలు పెడతారు. ఎలాంటి సంక్లిష్ట విషయాన్నయినా తన ఉద్వేగభరిత మనఃస్థితితోనే నింపాదిగా స్వీకరిస్తారు. అందువల్ల కవిత్వ నిర్మాణం ఆయన చేతిలోనే ఉంటుంది. అనేక భావోద్వేగ స్థితుల్లోంచి కూడా రాజకీయాల తెరచాప ఆయన కవిత్వానికి దిక్కును, చలనాన్ని అందిస్తుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఏది ఎక్కడ కవిత్వమవుతుందో సరిగ్గా తెలుసుకొని అక్కడే దాన్ని పట్టుకుంటారు. అరసవిల్లి కృష్ణ అన్నిటినీ తన సామాజిక, రాజకీయ దృష్టిలోకి అనువదించుకుంటారు. ఈ వేళప్పటి కన్నీటిలోకి, దుఃఖంలోకి, గెలుపు ఓటముల పోరాటాల్లోకి, ఆశ నిరాశల దేదీప్యమాన ప్రపంచంలోకి మనల్ని తీసికెళ్లడానికి ఆయన ప్రతి చోట తనదైన అంతరృష్టితో మనల్ని కనెక్ట్ చేసుకుంటారు. ఆ రకంగా తన చుట్టూ ఉన్న సామాజిక, రాజకీయ, ఉద్యమ పరిస్థితులతోపాటు వాటితో తన్లాడుతున్న మానవులను, మన వంటి పాఠకులను తన ఉద్వేగ ప్రపంచంలోకి తీసుకుంటారు. సరిగా ఆయన కవిత్వమయ్యే తావు అదే. -

                                                                                                                                              - పాణి

  • Title :Evelappudu
  • Author :Arasavilli Krishna
  • Publisher :Virasam prachuranalu
  • ISBN :MANIMN2986
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :176
  • Language :Telugu
  • Availability :instock