• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Fasijam Ante Emiti, Fasijanni Ela Edurkovali

Fasijam Ante Emiti, Fasijanni Ela Edurkovali By D Ramesh Patnaik

₹ 200

ఫాసిజం అంటే ఏంటి?
 

ఫాసిజాన్ని ఎలా ఎదుర్కోవాలి?

20వ శతాబ్దంలో ఐరోపాలో, జపాన్లో ఫాసిజం వచ్చినప్పుడు అది కార్మిక వర్గ విప్లవాన్ని ముందస్తుగా దెబ్బతీయడానికి (ప్రియెంప్టివ్ మెజర్గా) వచ్చిందని "విశ్లేషించారు. ఆనాడు ఐరోపా తీవ్ర సంక్షోభంలో ఉంది. రష్యాలో అప్పటికే బోల్షివిక్ డి విప్లవం వచ్చి ఉండటం, ఐరోపాలో వివిధ దేశాల్లో కార్మిక వర్గ పోరాటాలు = ఉదృతంగా సాగుతుండటం, ఐరోపా అంతటా కార్మిక వర్గ విప్లవాలు 2. చుట్టుకుంటాయనే ఆశ కార్మిక వర్గంలో, భయం పెట్టుబడిదారీ వర్గంలో ఉండటం ఇ ఆనాటి పరిస్థితి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయి అనేక యుద్ధ జరిమానాలు కడుతున్న జర్మనీలో జాతి న్యూనతా భావం తిరగబడి (మెటామార్పోసిస్ జరిగి) - ఆధిపత్యవాదానికి వనరయ్యింది. ఈ స్థితిలో హిట్లర్ నాజీ పార్టీ జర్మన్ ఆర్యజాతిని ఉతృష్టమైనదిగా ప్రచారం చెయ్యడం, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీలు * గుప్పించడం, జాతీయ వాదాన్ని సోషలిస్టు నినాదాలతో జోడించి ప్రచారం చెయ్యడం, ఒక గొప్ప జర్మనీని నిర్మిస్తామని ప్రతిజ్ఞలు చెయ్యడం; యూదుల పైన, - కమ్యూనిస్టులపైన, ప్రతిపక్షాలపైన అబద్ధాలు ప్రచారం చెయ్యడం, ప్రజలను ఒక ఉన్మాదంలోకి తీసుకుపోవడం, ఆ విధంగా ఆ పార్టీ (నేషనల్ సోషలిస్టు పార్టీ) పెరగడం గమనిస్తాం. కొత్తగా ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీ బలహీనంగా ఉండటం, సంఘటిత కార్మిక వర్గంలో ఆధిపత్యం కలిగి ఉన్న సోషల్ డెమోక్రాట్లు ఫాసిస్టు ప్రమాదాన్ని పూర్తిగా గుర్తించకపోవటం, నాజీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం దొరకటం నాటి పరిణామాలు. ఇటు ప్రభుత్వ బలగాలను అటు పార్టీ సాయుధ మూకలను ఉపయోగించి నాజీ పార్టీ అత్యంత భయానకంగా పాలించింది. నాజీ ప్రభుత్వం ప్రజలందరి హక్కులు హరించివేయటం, ఇంకా ప్రశ్నించిన వారిని ద నిర్బంధించటం, హత్యచేయటం, జర్మన్ జాతిని ప్రక్షాళన చెయ్యాలనే ఫాసిస్టు భావజాలంతో పదుల లక్షల సంఖ్యలో యూదులను చంపివేయటం మనం చూశాం. ఇటలీ, జపాన్ దేశాల్లో ఫాసిజం వివిధ స్థాయిల్లో తన దుర్మార్గాన్ని ప్రదర్శించింది. ఈ ఫాసిస్టు దేశాలు ఒక యాక్సిస్ గా ఏర్పడి చేపట్టిన దురాక్రమణ చర్యలు రెండో ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. ఆనాటి సోవియట్ యూనియన్, అమెరికా, బ్రిటన్ మిత్ర దేశాలుగా ఏర్పడినా, ప్రధానంగా సోవియట్ యూనియన్ చేసిన వీరోచిత పోరాటం వల్ల ఫాసిస్టు శక్తులు ఓడిపోయాయి. ఐరోపాలో అంతవరకు విస్తరిస్తూ ఉండిన ఫాసిజం చావు దెబ్బ తిన్నది. ఒక మేరకు ప్రపంచ శాంతి.................

  • Title :Fasijam Ante Emiti, Fasijanni Ela Edurkovali
  • Author :D Ramesh Patnaik
  • Publisher :Surya Chandra Prachuranalu
  • ISBN :MANIMN6697
  • Binding :Paparback
  • Published Date :2025
  • Number Of Pages :234
  • Language :Telugu
  • Availability :instock