₹ 100
హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెడుతూ డా.అంబెడ్కర్ స్త్రీలు విహాహితులైతే ఒక చట్టం, అవివాహితులైతే ఒక చట్టం, వింతంతువులైతే మరో చట్టం, ఇన్ని రకాలుగా ఉండటం సరైనది కాదని బలంగా వాదించారు. స్త్రీలకు ఆస్తి హక్కు ఉండాలని, ఆస్తి పంపకాల సందర్భంగా వితంతువుల పట్ల విపక్ష ఉండకూడదని మార్పులు సూచించారు. కులాంతర మతాంతర వివాహాలకు కూడా చెల్లుబాటు ఉండాలని, ధార్మిక పద్ధతులకి అతీతంగా రిజిస్టర్ పెళ్ళిళ్ళను ప్రవేశపెట్టి ఏ పద్దతిలో చేసుకునే పెళ్లికైనా గుర్తింపు గౌరవం ఉండాలని హిందూ కోడ్ బిల్లులో సూచించారు. ఇంకా చాల సందర్భాలలో చట్ట సభల్లో అయన స్త్రీల సమస్యల గురించి వాదించారు. స్త్రీలకు కుటుంబ నియంత్రణ పద్దతులను సులభంగా అందుబాటులో ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వానిదే అని గట్టిగ వాదించారు.