MAGISTRATE COURT (ప్రాముఖ్యత)
Section - 11 & Cr.P.C.
మేజిస్ట్రేట్ కోర్టులు.
ఈ యొక్క మేజిస్ట్రేట్ కోర్టులు అనెడివి ప్రాథమిక కోర్టులు అనగా ప్రతి క్రిమినల్ కేసుయందు అది ఎలాంటి కేసు అయిననుగాని సెక్షన్-323 దగ్గర నుండి సెక్షన్-302 మర్డర్ కేసు వరకు అనగా అతి చిన్న కేసు నుండి అతి పెద్ద కేసు వరకు పోలీసువారు ఒక ముద్దాయిని అరెస్టు చేసిన అనంతరము మొట్టమొదటిగా ఈ యొక్క మేజిస్ట్రేట్ కోర్టుయందే ప్రవేశపెట్టబడును. అందువలన వీటిని ప్రాథమిక కోర్టులు అని అనెదరు. నేరాలలో అత్యంత ప్రమాదమైనది మరియు ఆఖరిది మర్డర్ కేసు. మర్డర్ కేసులో గాయపడిన వ్యక్తి యొక్క ప్రాణమే పోవును. అందువలన నేరాలలో ప్రమాదమైన నేరము ఈ యొక్క మర్డర్ (302) కేసు. ఇలాంటి కేసులో కూడాను ఆ యొక్క ముద్దాయిని మొట్టమొదటగా మెజిస్ట్రేట్ కోర్టుయందే ప్రవేశపెట్టబడును. వాస్తవముగా మర్డర్ కేసులు అనెడివి సెషన్స్ కోర్టులు అనగా జిల్లా కోర్టులవారు విచారించెదరు. అయినను ఆ యొక్క కేసు కమిటల్ అయ్యేంతవరకు ముద్దాయిలు మేజిస్ట్రేట్ కోర్టుయందే హాజరు కావలసియుంటుంది. అంతటి అధికారము ఈ యొక్క మేజిస్ట్రేట్ కోర్టులకు ఉండును.
ఒక జిల్లా పరిధిలో ఈ యొక్క మేజిస్ట్రేట్ కోర్టులను Lower Courts అని అనెదరు. ఇవి దిగువ కోర్టులు అయినను ఎంతో ప్రాముఖ్యత కలిగియుండును. ఏదైన ఒక కేసులో అది ఎలాంటి కేసు అయిననుగాని పోలీస్ వారు ఒక ముద్దాయిని మేజిస్ట్రేట్ కోర్టు యందు ప్రవేశపెట్టిన సమయమున రిమాండ్ సరిగాలేక పోయిన, ముద్దాయిలకు కేసు పేపర్లు ఇవ్వకపోయినా ఆ యొక్క ముద్దాయిని Judicial Custody కి తీసికొనకుండా Reject చేసే అధికారము వారికి కలదు. ఒక ప్రాంతములో ఉన్న జైలుపై అజమాయిషీ కూడా వీరికే ఉండును. పోలీస్............