జరతూస్త ప్రయాణం
జరతూస్ర తన ముప్ఫై సంవత్సరాల వయస్సులో ఇంటిని వదిలి ఒంటరిగా అడవుల్లోకి వెళ్ళాడు. అతనక్కడే పదేళ్లపాటు ఏకాంతంగా, శాంతియుతంగా, అమితానందంతో జీవించాడు. కానీ ఒక రోజు ఉదయాన్నే ప్రకాశిస్తున్న సూర్యుని వైపు చూస్తుండగా జరతూకి ఒక ఆలోచన తట్టింది.
'ఓ సూర్యుడా...!
నువ్వు ప్రకాశిస్తున్నందునే ఈ పక్షులు సంతోషంగా ఉన్నాయి. పువ్వులు పుష్పిస్తున్నాయి. పరిమళిస్తున్నాయి. నీవల్లనే సమస్త మానవాళి జీవశక్తితో నిండి ఉంది. మరల రేపు ఉదయిస్తావనే నమ్మకంతోనే సంతోషంగా, ప్రశాంతంగా ఈ సమస్త జీవరాశి నిద్రపోతుంది. నువ్వు ఎవరి కోసం అయితే ప్రకాశిస్తున్నావో వారే లేకపోతే నీకు ఆనందం అనేది ఉంటుందా? పదేళ్ళుగా నువ్వు ఈ పర్వతం పైకి ఎగబాకి అలసిపోతూ కాంతిని వెదజల్లేది నాకోసం అయితే కాదు.
అవును... ఇది నిజం.
నువ్వు వెదజల్లుతున్న ఈ కాంతి, ఈ జీవశక్తి నీలో నిండుగా ఉంది. నీలో నిండుగా ఉన్న కాంతిని, జీవశక్తిని బరువుగా భావించి దానిని ఈ సమస్త మానవాళితో పంచుకోవాలని కోరుకున్నావు. ఆ మితిమీరి పొంగిపొర్లుతున్న కాంతిని, జీవశక్తిని మేము తీసుకున్నాము. అది స్వీకరించినందుకు గాను నిన్ను మేము ఆశీర్వదించాము.
నీలాగే నేను కూడా జ్ఞానంతో బరువెక్కి ఉన్నాను, ఎంతలా అంటే చాలా తేనెను సేకరించిన తేనెటీగలాగా.
నిజమైన జ్ఞాని ఎప్పుడూ కోపంగా ఉండడు. అతను ఉల్లాసభరితంగా ఉంటాడు. ఎందుకంటే అతను ఈ ఉనికి మొత్తం ఉల్లాసభరితమైనదని అర్ధం చేసుకోగలడు. నిజమైన జ్ఞాని కొంత మూర్ఖత్వంతో కూడా కనిపిస్తాడు. కానీ. సాధారణ మానవాళికి జ్ఞాని అంటే ఎప్పుడూ కోపంగా ఉంటూ ముఖం మీద..............