• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Friedrich Nietzsche

Friedrich Nietzsche By Ramana Gandi Reddy Amarnath

₹ 349

దేవుడు మరణించాడు. మనమే అతడ్ని చంపేశాం…!”
ఒక్క వాక్యం. కానీ అది శతాబ్దాలుగా నిలిచిన తత్వశాస్త్రాన్ని గడగడలాడించింది. ఈ మాట అన్నది తత్వవేత్తలలో తిరుగులేని తిరుగుబాటు – ఫ్రెడ్రిక్ నీషే.

నీషే రచించిన The Birth of Tragedy, Beyond Good and Evil, On the Genealogy of Morals రచనల సారం ఈ తెలుగు సంకలనం. కానీ ఇది సాధారణ రచన కాదు… ఇది మీరు నమ్ముకున్న నైతిక ప్రపంచాన్ని ప్రశ్నించే తొలి మెట్టు.

పాపం, పుణ్యం, మంచి, చెడు, మతం, ధర్మం, నైతికత వంటివి మనల్ని నియంత్రించడానికి సమాజం మనలో నాటిన భావనలే తప్ప అవి శాశ్వత సత్యాలు కావు. ఈ రచన ఆ భ్రమలను ఒక్కొక్కటిగా విప్పుతూ… నిజంగా స్వేచ్ఛగా ఆలోచించే వారిగా మిమ్మల్ని మారుస్తుంది. మీ లోపల ఉన్న బానిసను చంపేసి మిమ్మల్ని ఒక సింహంలా మారుస్తుంది.

ప్రతి పేజీ మీ మతం మీద, మీ నైతికత మీద, మీ జీవితాన్ని పునరాలోచించాల్సిన అవసరంపై ప్రశ్నలు వేస్తుంది.
మీరు నమ్మిన ప్రతి మంచి విషయం వెనుక దాగిన అసలు కథను బయటపెడుతుంది.

“మంచి-చెడు”, “పాపం-పుణ్యం”, “దయ-క్రూరత్వం” గురించి మీ అభిప్రాయాలు మారిపోవడం ఖాయం. ఈ రచన నిజాలను తట్టుకునే వారికి. భయపడేవాళ్లకు కాదు.

వెయ్యేళ్లుగా మనిషిని బానిసగా నిలబెట్టిన నైతిక భావాల చరిత్రను ఛేదించే ఓ అక్షర కత్తి ఇది. మీ అంతర్మనస్సులో దాగిన సంకెళ్లను మీరు స్వయంగా విరగ్గొట్టలంటే — ఇదే సరైన ప్రారంభం


మీ ఆలోచనలకు నిప్పు పెట్టే ఈ రచన మీ చేతుల్లోకి రావడానికి కేవలం ఒక క్లిక్ దూరమే.సిద్ధమా? మీరు చదవడం మొదలెడితే… మార్పు ఇప్పటికే మొదలైనట్టే.......................

  • Title :Friedrich Nietzsche
  • Author :Ramana Gandi Reddy Amarnath
  • Publisher :Logili.com
  • ISBN :MANIMN6365
  • Binding :Papar Back
  • Published Date :2025
  • Number Of Pages :256
  • Language :Telugu
  • Availability :instock