• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Gadhala Pathala Ganga

Gadhala Pathala Ganga By Sri Dharan Kanduri

₹ 270

సముద్రపు నీటి నురుగుతో తయారైన శ్వేతవినాయక విగ్రహం కొలువైన 'తిరువాలన్జ్బులి' ఆలయ విశేషాలు?

 

గతంలో, 'ద్రావిడదేశం'గా పిలువబడిన నేటి తమిళనాడులో మహాద్భుతమైన అనేక వైష్ణవ, శైవ మరియు ఆదిపరాశక్తి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలలో వెలసిన దైవ విగ్రహాలు కొన్ని ప్రత్యేకమైన విశేషాలను కలిగి ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి 'తిరువాల ులి' అనే శైవ క్షేత్రమని పరిశోధకులు మరియు భక్తులు ఉద్ఘాటిస్తున్నారు. ఈ క్షేత్రంలో ప్రధానదైవం పరమశివుడు అయినప్పటికీ, ఇదే క్షేత్రంలో పూజలందుకునే 'గణపతి' కారణంగా ఈ క్షేత్రానికి అపారమైన కీర్తిప్రతిష్టలు సంప్రాప్తించాయి. భారతదేశంలోని ఏ హైందవ క్షేత్రంలోనూ లేని ప్రత్యేకత ఈ క్షేత్రంలోని గణపతి విగ్రహానికి ఉన్నది. ఆ అద్భుత క్షేత్ర విశేషాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

స్వామిమలై క్షేత్రానికి 1 కి.మీ. దూరంలో ఉన్న తిరువాల ులి అనే గ్రామంలో మహాద్భుత రూపంలో కనపడే గణపతి కొలువైన ఒక ఆలయం ఉన్నది. నిజానికి, ఈ ఆలయ ప్రధాన దైవం 'కపర్దిఈశ్వరుడు' - అయినప్పటికీ ఈ ఆలయం గణపతి పేరుమీదుగా ప్రసిద్ధికెక్కింది. ఈ తిరువాలులిలోని వినాయక శివ ఆలయం దాదాపు 2వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిందని తెలుస్తున్నది. చోళనాడులో ప్రవహించే కావేరినది దక్షిణ గట్టుమీద ఉన్న 25వ శివ క్షేత్రంగా ఈ తిరువాలులి గుర్తించబడింది. ప్రాచీనకాలంలో ఈ క్షేత్రం - శక్తివనం, తిరునావర్తం, దక్షిణావర్తం అనే పేర్లతో పిలువబడింది.

తిరువాలులి గ్రామంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం - పరమశివుడు స్వయంభు లింగంగా అవతరించాడు. ఈయనకు కపర్దిఈశ్వరర్ లేదా జడైముడినాధర్ అనే పేర్లు ఉన్నాయి. శివుడి శిరస్సుపై చుట్టలు చుట్టిన జుట్టు ఉంటుంది కనుక, ఆయనను 'జడధారి' అని పిలుస్తారు. తమిళ భాషలో ఈ జడధారి అయిన శివుడిని 'జడైముడినాధర్' అని పిలుస్తారు. ఈ క్షేత్రంలో అమ్మవారిని పెరియనాయకై అనే పేరుతో పిలుస్తారు. ఈ క్షేత్రంలోని గణపతిని 'నూరై పిల్లియార్' అనే పేరుతో.............

  • Title :Gadhala Pathala Ganga
  • Author :Sri Dharan Kanduri
  • Publisher :Sri Dharan Kanduri
  • ISBN :MANIMN5142
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :286
  • Language :Telugu
  • Availability :instock