నువ్వు లేవు... నీ జ్ఞాపకాలున్నాయి...
తీరం వెంబడి ఒంటరిగా నిల్చున్నాను.
జ్ఞాపకాల్ని ఏరుకుంటూ
అనుభూతుల్ని నెమరేసుకుంటూ
申訴專
ఆప్యాయతల ఆలింగనాలన్నీ
అసహనపు సంకెళ్లుగా రూపుదాల్చి
అనుమానపు పొరలుగా విడిపోయినప్పుడు
ఆకాశం అందక అలసిన కెరటాల్లా
గుండెలోతుల్లో నిదురించే జ్ఞాపకాలన్నీ
తీరంకోసం ఆశపడుతూ
ఉవ్వెత్తున ఎగసిపడుతుంటాయి
專專寧
ఎప్పుడు కలిశామో.
ఎలా గడిపామో
ఎందుకు విడిపోయామో...........