తీరమొకటి కావాలి
బాధను మోయలేక పోతున్నాను
అడుగును అడుగును కలుపుకుంటూ
దరిచేరే దూరాన్ని లెక్కిస్తున్నాను
వరిచేలలో పిట్టలా ఎగిరినోన్ని
దుఃఖాన్ని కిలోమీటర్లుగా కొలిచినోన్ని
మలమల మల మాడిన రోజుల్లో కూడా మంచినీళ్ళను
బువ్వమెతుకనుకొని గతికినోన్ని
పావు కేజీ చక్కెరతోనే
జీవితమంతా పొట్లం కట్టబడ్డవాన్ని
పావెడు నూనె అప్పుతెచ్చుకొని
సంసార సముద్రాన్ని ఈదినవాన్ని
సుజలాం.. సుఫలాం
సస్యశ్యామలమని పాడుకుంటున్న
నా మాతృభూమిలో తలదాచుకోవడానికింత చోటులేనివాన్ని.................