• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Gandhari Vana

Gandhari Vana By Anil Dyani

₹ 100

కృష్ణానది ఒడ్డున రక్తవర్ణపు కల

2022 మొదట్లో అనుకుంటా - తమ్ముడు అనిల్ తన తరువాతి పుస్తకం గురించి చెబుతూ, 'ఈ సారి ముందు మాట నువ్వు రాయాలి' అని చెప్పినపుడు 'సరదాగా అని వుంటాడు' అని ఆ సంగతి మర్చిపోయాను. సంవత్సరం చివరి మాసాలలో కవితలు. పంపిస్తూ అప్పటి మాటను గుర్తు చేసినపుడు, వారించే ప్రయత్నమే చేసాను ముందు. ఒక కారణం, ఈ పనికి నా శక్తి సరిపోతుందా అన్న నా సందేహమైతే, అసలైన కారణం, ఇప్పటికే 'ఎనిమిదో రంగు' 'స్పెల్లింగ్ మిస్టేక్' కవితా సంపుటులతో తెలుగు కవిత్వ ప్రపంచంలో తనదైన గొంతును వినిపించిన, వినిపిస్తోన్న అనిల్ కు ఇక ముందు మాటల అవసరం లేదని నేను భావించడం!

అందుకే, దీనిని 'ముందుమాట' గా కన్నా, ఇష్టపడే కవి వెలువరిస్తోన్న కొత్త కవిత్వం మీద 'ప్రేమతో రాసే మాటలు' గానే ప్రారంభించాను.

తన రెండవ కవితా సంపుటి 'స్పెల్లింగ్ మిస్టేక్' లో 'కన్ఫెషన్ పేజీ' పేరున అనిల్ కొన్ని మాటలు రాసుకున్నాడు. అందులో అంటాడు 'నిరంతరం మన కళ్ళముందు జరుగుతున్న ఘోరాలూ దుర్మార్గాలూ నిలబడనీయకుండా చేసినపుడు అక్షరం చేసిన అంతర్మథనం మొత్తాన్ని తొలి కవితా సంపుటి 'ఎనిమిదో రంగు' గా తీసుకు వొస్తే, ఎన్నాళ్లయినా ఏమీ మారని సమాజంలో జరిగే అకృత్యాలని, తప్పిదాలని సరిదిద్దే అవసరం వుందనే ఆకాంక్ష కలిగినవాడిగా తాజా కవితా సంపుటి 'స్పెల్లింగ్ మిస్టేక్' తీసుకు వచ్చాడు'.

'కవిత్వం నీకు ఏమిటి?' అని కవులను ప్రశ్నిస్తే, ఒక్కో కవి ఒక్కో విధంగా స్పందించవచ్చు. బహుశా, ఎక్కువ మంది కవులకు ఒక స్పష్టత ఏదీ వుండకపోవొచ్చు కూడా! కానీ, అనిల్ కు అటువంటి ఇబ్బంది ఏదీ లేదు. అనిల్ తన రెండవ కవితా సంపుటిలోని 'కన్ఫెషన్ పేజీ' లో రాసుకున్న మాటలతో, తనకు కవిత్వం ఏమిటో స్పష్టంగానే చెప్పుకున్నాడు.

అందుకే, 'రాజధాని భూముల వివాదం' నేపథ్యంలో రాసిన 'ఆకుపచ్చని కన్నీరు' లో ఇట్లా వాపోతాడు- 'చిగురించడమే తెలిసిన నేల /ఇప్పుడొక ఫోటో ప్రదర్శన శాల/నీ బలంతో గట్టుకు గొడవ పడిన చోటంతా/ ఇప్పుడు శిలాఫలకాల బొమ్మల కొలువు/ ఎప్పుడో బీడు భూమిలో తాత నాగటికర్రు మోపిన చోటంతా/కొత్త జీవోల కలుపు............

  • Title :Gandhari Vana
  • Author :Anil Dyani
  • Publisher :Horu Prachuranalu
  • ISBN :MANIMN4000
  • Binding :Papar back
  • Published Date :Dec, 2022
  • Number Of Pages :108
  • Language :Telugu
  • Availability :instock