బోర్లించిన చెప్పు
అనుకోకుండా 'అమ్మ' ఫోన్ చేసింది. శరత్కు నెల కింద కొడుకు పుట్టాడట. ఫంక్షన్ ఇవ్వాళ సాయంత్రం రంగనాథ ఆలయంలో చేస్తున్నారు. అందరినీ రమ్మని చెప్పింది. మరీ ఆలస్యంగా చెబుతున్నందుకు 'మాఫ్' చేయమంది. 'కిస్మత్' ఉండబట్టి, నా నంబర్ అంకుల్ పాతడైరీలో దొరికిందట. మగవాళ్లను అంకుల్ అని పిలిచినా, కొంచెం పెద్ద వయసు ఆడవాళ్లను నేను అమ్మ అనే అంటాను. కొత్తపేట్లో ఉన్నప్పుడు అమ్మవాళ్ల పై పోర్షన్లో మేము కిరాయికుండేవాళ్లం.
ఆదివారం, అందునా ఇంట్లో ఒక్కడినే ఉన్నాను, పైగా పెద్ద ఎంగేజ్మెంట్స్ కూడా లేవు కాబట్టి బయల్దేరాను. హైదరాబాద్ నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే వుంటుంది. మాకు ఇంత దగ్గర్లో ఇంత పెద్ద గుడి వుందనే తెలీదు నాకు. గుడికి బయట అంటూ ఏమీలేదు. చెప్పుల్తోనే లోనికి వెళ్లి, భారీ దర్వాజా పక్కకు విడిచాను. వదిలిన చెప్పుల్ని బట్టి చూస్తే ఇంకా ఎక్కువమంది వచ్చినట్టు లేదు. ఫంక్షన్ ఆరింటికని చెప్పింది. ఫ్యామిలీగా వెళ్తే వేరే... ఇలాంటి చోట నాకు ఏమీ తోచదనే, మరీ టైముకు వెళ్లి ఇబ్బంది పడటం ఎందుకని ఓ అరగంట ఆలస్యంగా చేరేట్టే ప్లాన్ చేసుకున్నాను. అయినా జనం వచ్చినప్పుడే వస్తారు.
రోడ్డు పక్కనున్న గుడే అది. అయినా అంతటి రొద లోనికి రాకుండా గడప ఆలయాలకే ప్రత్యేకమైన నిశ్శబ్దం చెవులకు వినబడుతోంది. వెళ్తూనే, అమ్మ నా దగ్గరికి వచ్చి ఆహ్వానించింది, "కైసే హో బేటా” అంటూ, పొద్దున............