గంట
భీవండి సాంచన్ల కంపిన గంటలు ఊర్ల గుడి గంట మోగినట్టు ఆగకుండ మోగినై. నెత్తిన పిడుగు పడ్డట్టు ఉలిక్కిబడ్డాడు నాగరాజు. అడుగులను వేగంగా పెంచిండు. అందుకు పోకబోతే పనికి రానియ్యరు. కానూరు మాట్లాడితే పనిలకెల్లి తీసేస్తరు. అందుకని నాగరాజు ఒగర్సుకుంట కంపెనీ తానకు ఉరుక్కుంటొచ్చిండు. ఇరవై రూపాయల బస్సార్థికి సోచాయించి నడిసేసరికి, ఒళ్ళంత దిగచెమటలు వట్టినై. కంపినదగిన బస్సు దిగి సత్నారన్నతో కల్సి దబ్బదెబ్బ గేటు లోపలికి ఉరికిండు. గేటులోపల అడుగు బెట్టినంక పానం నిమ్మలమైంది. చేతిలున్న సద్దిబువ్వ లు చేయి మార్చుకుంట, దమ్ము తీసుకొని, కంపెని మెట్లెక్కి లోపలికి నడిశిండు. -కని నాగరాజును అంత దూరంలనే చూసి ప్రకాశు హాజిరేసిండు. అతనివైపు ఓ నవ్వు ot నవ్వి సాంచన్లను షురు జేసిండు నాగరాజు. 'తప్పు జరిగినప్పుడే, మనిషి సప్పుడెక్కువ జేసినట్టు' సాంచను ఏదో అనుము చెడినట్టుంది. సప్పుడు మారింది. దాని గొంతు పెంచింది. నాగరాజు పదేళ్ళ సంది ఆడ పనిజేస్తుండు. సప్పుడును పసిగట్టి, సాంచె పని తీరు పట్టేస్తాడు. 'కుక్క వేషమేస్తే, కుక్కలా అరవక తప్పదు.' అంగీ, లాగు మార్చుకొని, బేరింగులల్ల గింత తైలం బోసి, పానాలనందుకొని సాంచను కిందికి చేరిండు. ఆ పనయ్యాక మల్లోపాలి సిచ్చు ఏసిండు. అది ఈపాలి నాగరాజు -నికీ మాటిన్నది.
నాగరాజుకు సాంచను సప్పుడు సంగీతం లెక్కనే ఉంటది. ఎనక నుంచి ప్రకాశు పిలుస్తాంటే సాంచను సప్పుడుకు ఇనబడలేదు. దగ్గరికొచ్చి, "అరె రాజు భాయ్. ఆప్ కో ఘర్ సే ఫోన్ ఆయారే" అన్నడు. అతనిదీ నాగరాజు వయసే ఉంటది. బెంగాల్ నుండొచ్చిండు. హిందీలో మాట్లాడతడు. నాగరాజు ఆ ఫోను మాట్లాడి ఆదలబాదల ఊరికి బయల్దేరిండు. పోత పోత యజమానికి ఓ ముచ్చట చెప్పి పైసలు కావాలని అడిగి తీసుకొని బయటవడ్డడు.
సీదా నకిరేకల్లుకు బోయే టికెట్టు కొని బస్సెక్కిండు. కిటికీ పక్కన సీటు. శానాలకు ఇంటికి పోతుండు నాగరాజు. బస్సులో ఏదో హిందీ సినిమా..............