₹ 189
ఎవరు, ఎవర్ని ఏ విధంగా ప్రాభావితం చేస్తారో ఎవరికీ తెలీదు. ప్రేమ, ఆత్మీయత ఫలానా వాళ్ళ మీదే ఎందుకు కలుగుతుందో మనకి తేలినట్లు, మనం చెప్పలేనట్లు.! శిష్ట్లా రాజ్యలక్ష్మి గారు రాసిన "గణిత శాకుంతలం" చదివి, నాకు అలాగే అనిపించింది . ఆడపిల్లలు ఆందరికి, ముఖంగా గత తరం ఆడపిల్లలు, తమ తమ ప్రొఫెషన్ ల లో , వివాహాలలో స్థిరపడిన వారందరికీ గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి ఒక ఫాసినేషన్ . పరిస్థితులు కలసిరాక , ఇలా ఉన్నాను గానీ, సరైన ప్రోత్సాహం ఉంటేనా... అని ఆలోచించని ఆడవాళ్ళు అరుదు. ఇప్పుడు కూడా ఉన్నారు కానీ, కాస్త తగ్గిందేమౌ అనిపిస్తోంది. ఒక మహిళా శాస్త్రవేత్త తో మొదలైన మీ పుస్తక ప్రస్థానం అగణితమైన ప్రజ్ఞని, చదువరులలో జిజ్ఞాసని రేకెత్తిస్తుందని, అందుకు ఈ పుస్తకం పునాది అని నేను అభిలషిస్తున్నాను.
- Title :Ganitha Sakunthalam
- Author :S Rajyalakshmi
- Publisher :Notion Press
- ISBN :MANIMN1658
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :134
- Language :Telugu
- Availability :instock