• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Garbhagudi

Garbhagudi By Saleem

₹ 75

గర్భ గుడి

కంది పొలంలో కలుపు మొక్కలు ఏరుతుందన్న మాటేగాని చందనబాయి మనసు మాత్రం నడి సముద్రంలో పెనుతుఫానులో చిక్కుకున్న ఒంటరి పడవలా అల్లకల్లోలంగా ఉంది. గత రెండు వారాలుగా అదే సమస్యతో బాధపడ్తోంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియటం లేదు. ఐనా అది ఎవరికైనా చెప్పుకునే సమస్యనా? సిగ్గనిపించదూ.. తన తల్లే బతికుంటే ఆమెతో చెప్పుకోడానికి ఇంతగా సంశయించేది కాదు. తన పెళ్ళయిన మూడేళ్ళకే పెద్ద జబ్బేదో సోకి ఆమె చచ్చిపోయింది.

"ఏంటా పరధ్యానం తొందరగా కానీయ్. చీకటి పడేలోపల కొనలు తుంచే పని కూడా పూర్తి కావాలని చెప్పానా?" పొలం పనుల్లో మెరుపులా చురుగ్గా కదిలే చందన మందగించడం చూసి ఆమె పక్కనే కలుపు ఏరుతున్న భూక్యా గోపాల్ హెచ్చరించాడు.

చందన తల తిప్పి తన మొగుడి వైపు చూసింది. నీరుకాయపట్టిన లుంగీ, చిరుగులు పట్టిన బనీను, తలకు చుట్టిన నీలం రంగు పాగా... నల్లగా మాడిపోయిన మూకుళ్ళ మొహం.. పెళ్ళయిన కొత్తలో బాగానే ఉండేవాడు. మరీ తెలుపు కాకున్నా ఇంత నలుపైతే లేదు. చామన చాయ.. ఏడేళ్ళుగా పొలం పనుల్లో ఎండకు ఎండి, వానకు తడిసి... విత్తనాలు నాటినప్పటినుంచీ పంట చేతికొస్తుందో రాదోనన్న ఆందోళనకు లోనై... మొక్కలకు పురుగు పట్టినపుడల్లా అవి మొక్కలకు కాకుండా తన వొంట్లోకే చేరిపోయినట్టు బాధపడి... దుఃఖపడి.. ఎలా అయిపోయాడో... పాతికేళ్ళకే నలభై యేళ్ళు పైబడిన వాడిలా..

తన అనారోగ్య సమస్యని మొగుడ్తో పంచుకోవాలని ఎన్నిసార్లనుకుందో.. మొగుడైనా సరే అతన్తో ఆ సమస్యని ఎలా చెప్పగలదు? ఐనా ఇలాంటివన్నీ మగవాళ్ళకు అర్థమయ్యే విషయాలా? తేలిగ్గా తీసిపడేయరూ. అత్త బతికే ఉంది. పక్క వూరే.. బస్సెక్కితే అరగంట ప్రయాణం.. కానీ అత్త గయ్యాళితనం గుర్తుకు రాగానే భయమేసింది. ఆడదే.. కానీ రాక్షసి.. పెళ్ళయిన కొత్తలో రాచి రంపాన పెడితేనేగా తను వేరు కాపురం పెట్టందే వీల్లేదని పుట్టింటికెళ్ళి రెండు నెలలు మొగుడికి దూరంగా గడిపింది?

అసలే తన కొడుకుని తన నుంచి దూరం చేసిందన్న కోపం ఆమెకు గొంతు దాకా ఉంది. ఈ పరిస్థితుల్లో తన సమస్య చెప్తే ఏమైనా ఉందా? భూకంపం పుట్టించేదాకా.................

  • Title :Garbhagudi
  • Author :Saleem
  • Publisher :Navodaya Book House
  • ISBN :MANIMN6394
  • Binding :Papar Back
  • Published Date :Dec, 2024
  • Number Of Pages :80
  • Language :Telugu
  • Availability :instock