మట్టి
మడి
పాటించదు
హాలుడి గాథా సప్తశతి చదివాక ఎటువంటి అనుభూతి కలిగిందో, గరికపాటోడి కథలు చదివిన తర్వాత కూడా అదే అనుభూతి కలిగింది.
తన కాలపు కవిపండితులు ఆకాశమే హద్దుగా రాస్తుండిన అభూత కల్పనలకి, సంస్కృత ఛందోబద్ధమైన అరువు నయగారాలకీ పూర్తి విరుద్ధంగా సామాన్యజనుల జీవన లాలస అంతటినీ ప్రాకృతంలో నమోదు చేయడం గాథా సప్తశతి విశిష్టత.
ఎలాగంటే గాథాసప్తశతిలో శృంగారం కెరళ్లెత్తే కావ్యనాయికలు కానీ, అరివీర భయంకరులైన కథానాయకులు కానీ, దివి నుంచి భువికి దిగి మహిమలు ప్రదర్శించే దేవీ దేవతలు కానీ ఉండరు. నిరర్ధక సూక్తులు, గుడ్డి నియమాలు, స్త్రీలను జాగ్రత్తపరిచే పాతివ్రత్యాలు, మూఢ దైవభక్తి వగైరా సాహిత్యపు సరంజామా కానరాదు. అప్రతిహతమైన ఆదర్శాల నీతి జ్ఞాన వైరాగ్య బోధలు హెూరెత్తవు. తన కాలపు సమాజానికి అద్దం పట్టడం ఒకటే................