₹ 250
ఆధునిక భారతదేశంలో మతత్వం 1857 తర్వాత ఆరంభమైంది. 'విభజించు విధానం ద్వారా వలస పాలకులు, హిందూ - ముస్లీo మతాల మధ్య విద్వేషాన్ని రగిలించారు. మతతత్వ భావన, ఒక మతంలో వారిని, మరొక మతంలోని వారితో పోల్చి, వారి వెనుకబాటుతనానికి లేదా పీడనకు, విచక్షణకు ఎదుటి మతం వారు కారణమని చెప్తుంది. నిజానికిది అవాస్తవం, భ్రమ. వెనుకబాటుతనం, విచక్షణ, ఒకే మతంలోని వారి మధ్యలోనూ వుంటాయి. అన్ని మతాల్లోని పేదలు ఒకటే; వారి బాధలు, కష్టాలు, మంచీ చేడు ఒకటే! కాకుంటే, మతపరమైన నియమాల్లో, జీవన విధానంలో మార్పులుంటాయి. ఈ మార్పులు నిజానికి ఒక మతంలోని వారి మధ్య, కులపరంగా, ప్రాంతీయంగా, వుండడం కూడా చూస్తాం. అందువల్లే, సామాజిక శాస్త్రవేత్తలు, మతతత్త్వాన్ని కల్పిత భావనగా, ఒక మతంలోని స్వార్థశక్తులు మరొక మతం పై విద్వేషాన్ని కలిగించి, తద్వారా లబ్దిపొందే విధానంగా, విశ్లేషించడం చూస్తాం.
- డా, ఎబికె ప్రసాద్
- Title :Gatham Paathara Nunchi Matham Jatharaloki. . . !
- Author :Dr A B K Prasad
- Publisher :Basaveswara Publications
- ISBN :MANIMN0468
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :380
- Language :Telugu
- Availability :instock