'అమ్మా, వర్షం ఎందుకు కురుస్తున్నదే?' అని పిల్లవాడు అడుగుతాడు. చదువురాని తల్లయితే 'బాబూ దేవుడు కురిపిస్తున్నాడురా' అంటుంది. విద్యావతి అయిన తల్లి అయితే 'నీరు ఆవిరిగా మారి మేఘాలుగా మారి చల్లబడప్పుడు వర్షం కురుస్తుంది' అని శాస్త్రీయంగా విశద పరుస్తుంది.
'అమ్మా అన్నయ్యేందుకు చనిపోయాడే' అని అడుగుతాడు పిల్లవాడు. తల్లి మూడురాలయితే 'బాబూ భూమిమీద నూకలు చెల్లిపోయాయిరా! దేవుడు తీసుకొనిపోయాడు' అంటుంది. విజ్ఞానవతి అయిన తల్లి 'నాయనా, మీ అన్నయ్య వద్దన్న కొద్దీ రోడ్డు మీద అమ్మే మిఠాయి తిని కలరా తెచ్చుకున్నాడు. కలరా క్రిములు రక్తాన్నంతా పాడుచేసినందువల్ల చనిపోయాడు' అని బోధపరుస్తుంది.
ఒకటి మూఢనమ్మకం రెండవది శాస్త్రీయం. ఒకటి ఆధిదైవికం రెండవది భౌతికం
ఒకటి అలౌకికమైన శక్తుల గురించిన నమ్మకాలపై ఆధారపడితే, రెండవది ప్రకృతి పరిణామాల గురించి విజ్ఞానంపై ఆధారపడుతుంది.
తత్వశాస్త్రంలోనూ ఇదే వరస. ఆ వరసనే విశదీకరిస్తుందీ పుస్తకం,