గీతగోవిందం - నృత్య నాటిక
కాన్సెప్ట్ మరియు మ్యూజిక్ కంపొజిషన్ - సద్గురు శ్రీశివానందమూర్తి గారు
కొరియోగ్రఫి మరియు డైరెక్షన్ - శ్రీమతి రాజేశ్వరి పర్వతరాజు
కళలు ఆత్మ సంస్కృతి అని ఐతరేయ బ్రాహ్మణం బోధిస్తుంది. ఆధ్యాత్మికతను లక్ష్యంగా, పరమావధిగా కలిగి ఉండడం భారతీయ కళలకు గల విశిష్టత. అందుకే వాటి ఉద్భవం, గమ్యం ఏకం. అనేకమంది జ్ఞానులు, ఋషులు, కవులు మరియు కళాకారులు కళలను ఆధ్యాత్మిక సోపానాలుగా భావించారు. ఆ నేపధ్యంలో శ్రీగురుదేవులు శ్రీ జయదేవ విరచిత "గీత గోవిందం" కావ్యాన్ని పరిశీలించి, దానికి సంగీతం సమకూర్చారు. నాట్యానికి అనేక సూచనలిచ్చారు.
ఈ కావ్యం మధురభక్తి సాంప్రదాయంలో రచించబడింది. శ్రీగురుదేవుల ధర్మపత్ని శ్రీమతి గంగామాతకు, అష్టపదులు మిక్కిలి ఇష్టం. "అష్టపదులు చెరుకుగడ లాంటివి. భాష కాస్త కఠినంగా ఉన్నా, భావం చాలా మధురంగా ఉంటుంది అనేవారు. వాటికి నేను సంగీతం సమకూర్చుతాను" అని శ్రీగురుదేవులు మాట ఇచ్చారు.
గంగామాత పరమపదించిన తరువాత కొంతకాలానికి రాజేశ్వరి ఏదైనా కొత్త ఇతివృత్తం కలిగిన నాట్యాంశాన్ని సూచించమని శ్రీగురుదేవులను ప్రార్ధించింది. అప్పుడు గురుదేవులు గీతగోవిందం కావ్యానికి నాట్యం సమకూర్చమని నిర్దేశించారు. ఫలితం గీతగోవింద నృత్యనాటిక.
ఈనృత్యనాటిక ప్రత్యేకతలు ఏంటి? ఇప్పటి వరకు అనేకమంది ఈ కావ్యంలోని కొన్ని అష్టపదుల్ని లేక కొన్ని చరణాలు తీసుకొని వాటిని సోలో ఐటమ్ గా ప్రదర్శించారు. కాని శ్రీగురుదేవులు ఆ కావ్యం సమగ్రత కలిగియుండి రసోత్పత్తి కలుగజేయాలంటే దానిలోని అష్టపదులను ఒక ధారగా ప్రదర్శించాలి. అప్పుడే కావ్యానికి న్యాయం................