• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Geetha Soundaryam

Geetha Soundaryam By Ramadevi Motaparti

₹ 50

ఒకమాట

శ్రీ భువనచంద్రగారు నాకు అమ్మ ద్వారా ఫోన్లో పరిచయం అయ్యారు ఊహించని రీతిలో. ఆ తర్వాత తెలిసింది. వారు చిన్నప్పుడంతా ఒక ఆశ్రమంలో పెరిగారని. ఆ తర్వాత ఎయిర్ఫో లో 18 సం|| పనిచేశారని సినీపాటల రచయితగా స్థిరపడ్డారని, రచయితగా చాలా రచనలు చేశారని చెప్పారు.

నాతో మొదట మాట్లాడినప్పుడు ఆయన వ్రాసిన “వాళ్ళు” పుస్తకం చదవమన్నారు. చదివాను. తర్వాత మిగిలిన ఆయన రచనలు అన్నీ చదివాను. అన్నీ చదివిన తర్వాత “వాళ్ళు” పుస్తకం చివర్లో “నన్ను నేను తెలుసుకోవటానికి ఈ కాషాయవస్త్రాలు అవసరం లేదని చెప్పి ఆ వస్త్రాలని తీసి, మామూలు వస్త్రాలు ధరిస్తారు. మొత్తంగా భువనచంద్రగారు అంటే జ్ఞాపకమొచ్చేది ఆ ఒక్కటే.

ఈ విజ్ఞత ఎంతమందిలో ఉంటుంది? ఆ ఆలోచన, వ్యక్తిత్వం అనేది ఈ వాళ్ళు పుస్తకంలో ఆయన జీవిత ప్రామాణికం ఈ ఒక్కమాటలో

కన్పించింది.

'ఆయన రచనల్లో అన్నీ ఉంటాయి. అన్నిటిలో మమేకమైనా కూడా దేనికీ అంటకుండా, అన్నిటికీ అతీతంగా, వీటన్నిటికీ దూరంగా, నిశ్శబ్దంగా ఉండే మౌనిలాగా కన్పిస్తారు.

ఆయన ముందుమాటలో వాళ్ళ నాన్నగారి మాటగా ఒకమాట చెప్పారు. ఈ గీతాసారాంశం మనం ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా, ఆయన చెప్పింది, అందరిలో ఉన్నది ఆ ప్రాణశక్తి ఒక్కటే అన్నది. ఇది భువనచంద్ర గారు చెప్పటం, ఆ వాక్యం వ్రాయటం అందరూ గుర్తుంచుకోవాల్సిన అమూల్యమైన మాట. అట్లాంటి అద్భుతమైన వ్యక్తి నాకు ఈ ఆప్తవాక్యాలు వ్రాసి పంపించినందుకు హృదయపూర్వక పాదాభివందనాలు.

నమస్తే................

  • Title :Geetha Soundaryam
  • Author :Ramadevi Motaparti
  • Publisher :Sahithi Prachuranalu
  • ISBN :MANIMN3303
  • Binding :Papar Back
  • Published Date :May, 2022
  • Number Of Pages :96
  • Language :Telugu
  • Availability :instock