• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Geetu Rayipai Akshara Darshanam

Geetu Rayipai Akshara Darshanam By Seela Subhadra Devi

₹ 200

పటాటోపం లేని కవిత

- కె. శివారెడ్డి

సుభద్రాదేవిగారి కవిత్వం చదువుతుంటే - ఒకందుకు జేన్ ఆస్టిన్, ఎమిలీ డికిన్సన్, మరొకందుకు సిల్వియా ప్లాత్, సెతయేవా గుర్తుకు వచ్చారు. జేన్ ఆస్టిన్ కవి గాదు, నవలా రచయిత్రి. ఇంటినే కేంద్ర బిందువుగా చేసుకుని intutive perception of knowledge తో గొప్ప నవలలు రాసింది. డికిన్సన్ అంతే - ఇల్లు దాటి ఎరుగదు - ఆమె చనిపోయింతర్వాత అనుకుంటా, ఆమె కవిత్వం అచ్చయి అందర్నీ ఆశ్చర్యంలో ముంచింది.

నాకు తెలిసినంతవరకు సుభద్రాదేవిగారు కూడా ఇంటినే కేంద్రబిందువుగా చేసుకుని మధించటం మొదలెట్టారు. అయితే ఒక్క తేడా వుంది. జేన్ ఆస్టిన్, డికిన్సన్ Subjectiveగా కాక, Objectiveగా అందుకున్నారు. ఆత్మానుభూతులే - ప్రపంచాన్ని గూర్చి స్పందించేటప్పుడు మన రక్తం ద్వారానే ప్రసారమౌతాయి. స్వకీయమైంది కాక, వస్తువుని స్వీకరించటంలో సుభద్రాదేవిగారు ఏమాత్రం తప్పటడుగు వేయలేదు.

మరొక్క విషయం - ఏ ఒకరిద్దర్నో మినహాయిస్తే, తతిమ్మా ఆడవాళ్ళంతా - గాలి పోగుచేసి నవలలు రాసి డబ్బులు చేసుకుంటున్న రోజుల్లో సుభద్రాదేవిగారు Social awarenessతో కవిత్వం రాయటం ఏమాత్రం పటాటోపం లేకుండా నాకానందాన్ని కలుగజేసింది.

ఆడాళ్ళలో కవిత్వం రాసేవాళ్ళే తక్కువ. ఆ రాసినవాళ్ళయినా ఆడంబరానికో, తద్వారా ఏదన్నా సాధించుకోవటానికో - ఏమాత్రం తెలివి లేకుండా వున్న తరుణంలో - ఇది ఆహ్వానించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను..................

  • Title :Geetu Rayipai Akshara Darshanam
  • Author :Seela Subhadra Devi
  • Publisher :Seela Veerraju
  • ISBN :MANIMN4654
  • Binding :Papar back
  • Published Date :Nov, 2016 first print
  • Number Of Pages :222
  • Language :Telugu
  • Availability :instock