జంటిల్ ఎనిమీ
ఆకాశంలో చుక్కలు మిణుకు మిణుకుమంటున్నాయ్. చంద్రుడు ఎప్పుడో అస్తమించాడు. చీకటి పరదా కప్పినట్లు చుట్టూ ఆవరించుకుని వుంది! ఎక్కడో గుడ్లగూబ ఒకటి వికృతంగా అరుస్తోంది!
ముత్తు కళ్ళు చికిలించి ముందుకు చూశాడు.
ఎత్తయిన గోడ... తొమ్మిది అడుగులుంటుంది... రాళ్ళతో కట్టింది పొడుగ్గా రేఖా మాత్రంగా కనబడుతోంది!
ముత్తు ముందుకు కదిలాడు!
గాలిలో బొగ్గుకాలిన వాసన అతని ముక్కుపుటలను తాకుతోంది! అతను మెల్లగా ముందుకు అడుగులు వేయసాగాడు.
ముప్పయ్ అయిదు సంవత్సరాల ముత్తు వంటిమీద దుస్తులు మాసిపోయి వాసన కొడుతున్నాయ్. అరగంట క్రితం తాగిన నాటుసారా వాసన అతను నిలబడినంత మేరా తన సుగంధాన్ని వ్యాపింపచేస్తోంది. జీబురుగా ఉన్న తల తైల సంస్కారం లేకపోవటంతో చిందర వందరగా ఉంది! కళ్ళు ఎర్రగా అగ్నిగోళాల్లా మెరుస్తున్నాయ్.
గోడవరకూ వచ్చి ఆగాడు ముత్తు. అతని చెవులు రిక్కించుకున్నాయ్! ఎక్కడో లీలగా వినబడుతున్నాయ్ శబ్దాలు! నాలుకతో పెదాలు తడుపుకున్నాడతను! అతనికి హఠాత్తుగా తన మిత్రుడు వేలు గుర్తుకు వచ్చాడు........................