• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Gharshana Kathalu

Gharshana Kathalu By Aparna Munukuntla Gunupudi

₹ 150

పువ్వుల జడ

పెద్ద క్లాసులకి వచ్చిన మంజుల స్కూలు నుంచి ఉత్తరం వచ్చింది. ఏమిటి అయ్యుంటుందా అని తల్లి శ్యామల తెరిచి చూస్తే స్కూల్లో కౌన్సిలింగ్ సర్వీసెస్ ఉన్నాయి. పిల్లను తీసుకుని కౌన్సిలర్ని చూడమని, ఫలాన తేదీకి రమ్మని ఉంది.

పిల్ల గురించి కౌన్సిలింగ్ ఏమిటి? కూతురు ఏం కొంప ముంచిందో అనుకుంటూ భర్త రాజుతో చెప్పింది. రమ్మన్నారు కనక వెళ్ళడమే అన్నాడు రాజు. కౌన్సిలింగ్ అనగానే కొంచెం ఖంగారు కలగడం వల్ల ఆ రోజు కోసం కాస్త ఆదుర్దాగా ఎదురు చూసింది. ఎదురు చూసిన రోజు రానే వచ్చింది.

ముగ్గురూ కలిసి స్కూలుకి వెళ్ళేరు. ఏం చెబుతుందో అనుకుంటూ మిస్ మార్షల్ని కలిశారు. పరిచయాలు అయ్యేక ఆవిడ మెల్లగా పదమూడేళ్ళనించి పదహారేళ్ళ వయసు పిల్లలని ఎలా పెంచాలి, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులని ఎదుర్కొంటారు, అబ్బాయిల గురించి, వాళ్ళ ప్రేమల గురించి, వాళ్ళ మనసులో ఏముందో, ఎలా తెలుసు కోవాలో, వాళ్ళతో ఎలాగ మాట్లాడాలో, ఆ మాట్లాడడంలో సంబంధాలు తెగిపోకుండా ఎలా ఉంచుకోవాలో వివరంగా చెప్పింది.

ఆవిడ చెప్పినవన్నీ విని బయటకి వస్తూ ఉంటే, తన చిన్నప్పటి విషయాలు గుర్తొచ్చాయి.

తను స్కూలునించి ఇంటికి వచ్చేటప్పటికి ఓ పన్నెండేళ్ళ పిల్ల అమ్మ దగ్గరికి వచ్చి

"అత్తయ్యగారు, రేపు నాకు పువ్వుల జడ వెయ్యరూ? ఏం పువ్వులు కావాలో చెబుతే రేపు మా నాన్న తెచ్చిపెడతానన్నారు" ప్రాధేయపడుతూ అంటోంది. “ఇప్పుడు పువ్వుల జడ ఎందుకే పావని?" అడిగింది, అమ్మ.

"మరేమో మొన్న గుడికి వెళితే అక్కడ ఒక అమ్మాయి వేసుకుని కనిపించింది. నేనేమో మా అమ్మని నాకు కూడా వెయ్యమని అడిగేను. అమ్మేమో మన పేటలో ఎవరికి పువ్వుల జడ కావాలన్నా కమలత్తయ్య గారే వెయ్యాలి. ఆవిడకి......................................

  • Title :Gharshana Kathalu
  • Author :Aparna Munukuntla Gunupudi
  • Publisher :Vanguri Foundation of America
  • ISBN :MANIMN6177
  • Binding :Papar back
  • Published Date :March, 2015, 2nd print
  • Number Of Pages :139
  • Language :Telugu
  • Availability :instock