నేనొక పుస్తకాన్ని చదువుతూ ఉండేవాణ్ణి. అందులో
ఇలా వ్రాసి ఉన్నది: ఇంటికి వచ్చిన అతిథిని
భోజనం చేసేరా అని అడగాలి. భోజనం గురించి
అడగకపోతే నీళ్లు కావాలా అని అడగండి.
నీళ్లు కావాలా అని కూడా అడగలేకపోతే కూర్చోమని
ఆసనం చూపండి. ఆసనం కూడా చూపడానికి
అవక పోతే నాలుగు తీపి మాటలు మాట్లాడండి.
తీపి మాటలు చెప్పలేకపోతే తక్కువలో తక్కువగా
చిరునవ్వు పెదవుల మీదకు తెచ్చుకోండి
అదికూడా చెయ్యలేక పోతే ఉరేసుకొని చావండి................