• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Ghost Murders

Ghost Murders By Temporao

₹ 300

ఘోస్ట్ మర్డర్స్ !

రాత్రి పదిదాటింది. ఇంకా భర్త రాజారావు ఇంటికి రాలేదు. విమల పరుపుమీద పడుకొంది. గదిలో జీరో వాట్ బల్బ్ వెలుగుతోంది. ఆమెకు నిద్రపట్టడంలేదు. క్లబ్బులో కూర్చుని చీట్లపేక ఆడుతూ భర్త ఇంటిని మర్చిపోయి వుంటాడు!

ఏదో చప్పుడయింది. ఉలిక్కిపడుతూ ఆమె లేచి కూర్చుంది. లోపల గదుల్లోంచి ఏదో చప్పుడు వినపడుతోంది. బాత్రూమ్ పక్కనున్న స్టోర్ రూమ్లోంచి ఆ చప్పుడు వస్తోందని ఆమె ఊహించింది. స్టోర్ రూమ్లో ఎంతో తుక్కుంది. ఆ గదిని బాగుచేయడానికి ఆమెకు టైము చిక్కడంలేదు. అప్పుడే ఈ ఇంటికొచ్చి మూడేళ్ళు దాటింది.

పక్కనే మరో పరుపుమీద పడుకున్న కూతురివైపు ఆమె చూసింది. సుందరి గాఢ నిద్రలోవుంది. ఆమె వయస్సు పదేళ్ళుంటుంది. విమల మళ్ళా పరుపుమీద వాలింది. ఏవేవో చప్పుళ్ళు వినపడుతున్నాయి పక్క ఇంట్లోంచి.

విమల ఆలోచిస్తోంది పక్కఇంట్లో ఎవ్వరూలేరు. ఇంటికి తాళంవేసి వుంటుంది. పదేళ్ళక్రితం ఎవరో అడ్వకేట్ అందులో వుండేవాడు. కొడుకు చనిపోయాక అడ్వకేట్ భార్యతోసహా కాశీకి వెళ్ళిపోయాడు. మళ్ళా తిరిగి రాలేదు. వాళ్ళిద్దరూ ఏమయ్యారో ఎవ్వరికీ తెలియదు. వాళ్ళు వెళ్ళిపోయిన కొద్దికాలానికి కూతురుకూడా మరణించింది. ఇదంతా ఊళ్ళోవాళ్ళు చెప్తూంటే విమల విన్నది. ఆమెకు బియ్యం అమ్మే మీరయ్య జ్ఞప్తికొచ్చాడు.

ఆ వీధిలో వాళ్ళందరికీ గత ఇరవై ఏళ్ళగా మీరయ్య బియ్యం అమ్ముతున్నాడు. అతడికి అందరిచరిత్రా తెలుసు.

"విమలమ్మగారూ, పక్కింట్లో అడ్వకేట్ మూర్తి వుండేవారు. మంచి ప్రాక్టీస్. ఆయనకూతురు డాక్టర్ చలంగార్ని పెళ్ళాడింది. కాని ఆమె చనిపోయింది. కొడుకు శేఖర్ ఈ ఇంట్లోవుండే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెపేరు పార్వతి. పార్వతి చాలా అందంగా వుండేది. పార్వతి ప్రేమ ఫలించలేదు. శేఖర్ చనిపోయాడు. పార్వతి తల్లీ తండ్రి ఈ ఇల్లువిడిచి వెళ్ళిపోయారు," అన్నాడు మీరయ్య ఒకసారి....................

  • Title :Ghost Murders
  • Author :Temporao
  • Publisher :Classic Books
  • ISBN :MANIMN5016
  • Binding :Paerback
  • Published Date :Dec, 2023
  • Number Of Pages :287
  • Language :Telugu
  • Availability :instock