విద్యారంగానికి గిజూభాయి సేవలు
రాంనరేష్ సోనీ
గిజూభాయి అనే పేరు వినగానే మన కళ్ళ ఎదుట ఒక వ్యక్తి వచ్చి నిలబడతారు. ఆయనకు విద్య అంటే ఆపారమైన అభిమానం. ఆయన విద్య యొక్క నిజమైన శక్తిని గుర్తించిన వారు. విద్య ద్వారా ఎన్నో మంచి మార్పులు తేవచ్చునని నమ్మిన వారు. ఉపాధ్యాయులు విద్యార్థుల వ్యక్తిత్వాన్ని చక్కటి రీతిలో తీర్చిదిద్దగలవారు అని నమ్మిన వారు. విద్య ద్వారా సమాజంలోని ఎన్నో దుర్గుణాలను మాపవచ్చునని దృఢంగా విశ్వసించిన వారు ఆయన.
గిజూభాయి పేరు వినగానే నా ఎదుట ఒక సాధారణమైన వ్యక్తి, అయితే అదే సమయంలో ఒక అసాధారణమైన ఉపాధ్యాయుడు వచ్చి నిలబడతాడు. విద్యారంగంలో నెలకొని వున్న ఎన్నో మూఢనమ్మకాలు, గుడ్డి పద్ధతులు, విచక్షణలేని నియమనిబంధనలు మొదలగు వాటి నుంచి విద్యార్థులను విముక్తి చేసిన వారు అయన. కఠినతరమైన పాఠశాల వ్యవస్థను అతి సరళమైనదిగా మార్చిన వారు ఆయన. స్కూలు సిలబస్కు సవాల్ విసిరిన వారు ఆయన. గిజూభాయి బాలల కొరకు నిజమైన జీవితాన్ని ప్రసాదించగల, విముక్తికలిగించగల విద్యా విధానం ప్రతిపాదించారు.
నావరకు అయితే జూభాయి పేరు ఎంతో వివేకవంతుడైన, ప్రయోగనిష్టుడైన, సాహసపరుడైన ఉపాధ్యాయుని పేరుగా కనిపిస్తుంది. ఆయన జీవితం పూర్తిగా పిల్లలకు అంకితం చేయబడింది. ఆయన ఎల్లప్పుడు బానిస మనస్తత్వాన్ని బద్ధలు కొట్టుకుని స్వేచ్ఛ, సృజనాత్మకత సమర్ధిస్తూవుండేవారు. ఆయన కేవలం విద్యకు సంబంధించిన సిద్ధాంతాలు మాత్రమే వల్లెవేస్తుండేవారు కారు. చైతన్య............