జననం
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం పొటియా రాంసింగ్ నాయక్ తండాలో రాథోడ్ మంగ్యా నాయక్, సామ్నీబాయి అను లంబాడి గిరిజన దంపతులు రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్నారు.. వర్షాకాలాధారిత కౌలు వ్యవసాయంతో పంటలు పండిస్తూ, పశు సంపాదనతో ఆధ్యాత్మికమైన దైవారాధనతో ప్రకృతికి దగ్గరగా జీవనయానం సాగిస్తున్నారు. బంజార సంస్కృతి సంప్రదాయాలకు కొలువైన ఆ కుటుంబంలో గోర్ వంశము, రాథోడ్ గోత్రము యందు 10 అక్టోబర్, 1963 మంగ్యానాయక్ - సామ్నీబాయి దంపతులకు శ్రీ రాథోడ్ భీం రావు సుపుత్రుడిగా జన్మించారు.
మానవ లోకంలోనే కాదు, ముల్లోకాల్లోనూ చరాచరాలకు పేర్లుంటాయి. పేరు లేని మనిషి ఉండడు. పేరు లేని దేవుడు లేడు. మనిషి తాను జీవించినంత కాలం తనకు మంచి జరగడానికి దేవతల ఆశీస్సులు కోరుకుంటాడు. తన సంతతికి మంచి జరగాలని దేవతల పేర్లు పెట్టుకొని ఆరాధిస్తుంటారు. అలాగే భీం రావు గారి మాతృమూర్తి సామ్నీబాయి, భీమయ్యక్ (భీమల్ ఫెన్) దైవాన్ని సంతానం కోసం ఆరాధిస్తుంది. తమకు సంతానం కల్గితే నీ నామామే పెట్టుకుంటాము అని మొక్కులు మొక్కుకుంది. అలా దైవ దీవెనలతో జన్మించిన సుపుత్రుడికి భీంరావ్ అని నామకరణం చేసింది. ఈ పేరుతోనే ఆయన ప్రసిద్ధుడు అయ్యారు..........................