మొదటి మాట
రాధామాధవులైన శ్రీకృష్ణ ప్రేయసి
జనక మహారాజుకి సీతాదేవి లభించిన రీతిలో, విష్ణుచిత్తులవారికి (పెరియాళ్వార్) తమిళ్ నాడు రాష్ట్రంలో శ్రీవిల్లిపుత్తూర్ నందనవనంలో ఆండాళ్ ఒక తులసి చెట్టు వద్ద లభించింది. తమిళం లో కోదై (గోదాదేవి) అనగా తులసి మాల అని అర్థం. కోదా అని పిలిచేవారు. కోదై, చూడిక్కొడుత్త నాచ్చియార్, ఆండాళ్, ఆముక్త మాల్యద అనీ పిలిచేవారు. గోదాదేవి ధరించిన తరువాత, శ్రీరంగంలో రంగనాథుని తను ధారణ చేసిన మాలలు సమర్పించినవారు. జన్మ నక్షత్రము నల సంవత్సరం, కర్కాట మాసము, పుబ్బా నక్షత్రము, ఆషాఢ శుద్ధ చతుర్దశి, కాలం, శతాబ్ది 776 జన్మించారని నిశ్చయించారు. అది లక్ష్మీ దైవాంశ తో అవతరించిన గోదాదేవి. ఆమె రచనలు: తిరుప్పావు, నాచ్చియార్ తిరుమొళి. శ్రుతి, స్మృతుల మూలార్థాన్ని తేట తేట పదాలతో తమిళంలో పాశురాలుగా పాడి, ధనుర్మాస (శ్రీ) వ్రతాన్ని ఆచరించినారు. బృందావనంలో గోపికలు అనంత శక్తిస్వరూపుడైన శ్రీకృష్ణుణ్ణి తమ 'ప్రియమైన' చెలికాడుగా ప్రేమించి ఆరాధించారు. శ్రీ కృష్ణుని పొందగలిగారు. శ్రీ కృష్ణుడే నారాయణుడనీ, ప్రియునిగా, నాయికా భావంతో శ్రీరంగనాయికగా ప్రకటితమైన మహిత ప్రేమమూర్తి గోదాదేవి.
అందరికీ సులభంగా అందడమే భగవంతుడి సార్వజనీన లక్షణమనీ పరమ భక్తులై పరమ వైకుంఠుని చేరిన ఆళ్వార్లలో తిరుప్పావై అద్భుతమైన 30 పాటలు రచించి, రంగనాథుడిలో ఐక్యమైనది గోదాదేవి అని, వేయేళ్ల కిందట శ్రీరామానుజులు చాటిచెప్పారు. జీవితమంతా ఆ సూత్రాలను అనుసరించి చేసి చూపారు. భక్తి ఉద్యమం ప్రజలలోనాటుకు పోవడానికి, వేల సంవత్సరాలనుంచి ఉండి పోవడానికి కారణం ఆ సార్వజనీన సార్వకాలికతే. అందరికీ సమానంగా అందకపోతే అది ప్రకృతి విరుద్ధం అనే సామాన్య సూత్రం భక్తి ఉద్యమంలో మూల సూత్రం. సమత, సమానత....................