₹ 60
ఒకసారి నేను యాత్రకు వెళ్ళినప్పుడు ఒక దివ్య క్షేత్రమునకు వెళ్ళాను. యాత్రలో నిత్యము ఉండే ఒడిదొడుకులు, మనము చేయాల్సిన పనులు ఏవీ ఉండవు కాబట్టి మనస్సు ప్రశాంతముగా ఉండి ప్రకృతి రమ్యతను క్షేత్రము యొక్క దివ్యానుభూతిని పొందుటకు సూర్యోదయమునకు సుమారు ఒక గంట ముందుగా గదిలో నుంచి బయలుదేరి వెళ్ళాను. పచ్చని చెట్లు, పచ్చిక బయళ్ళతో ఆ ప్రాంతము ఎంతో సుందరముగా ఆహ్లాదకరముగా ఉన్నది.
అక్కడ ఒక ఆవు దాని పెయ్యితో గడ్డి మేయుటకు బయలుదేరినది. ఆ ప్రాంతమంతా దానికి సుపరిచితమో ఏమో కాని అవి యజమాని లేకుండా బయలుదేరి వెళ్ళినది. దారి పొడుగునా తల్లి దూడను ముద్దాడుచు, నాకుచు దూడయందు ఆప్యాయత చూపుచూ నడుస్తూ ఉంటే ఎంతో ముచ్చట వేసింది. దూడ కూడ ఆనందముగా తోక పైకెత్తి గెంతుతూ ముందుకు పరుగెత్తి మళ్ళీ వెనక్కి పరుగెత్తుకుంటూ వచ్చి ఆనందముతో తల్లిని మూతితో ముట్టి ఆనందిస్తూ తల్లిని ఆనందపరచినది. ఈ దృశ్యమంతా నేను నా కళ్ళతో చూసాను. అది చూసి నాకు గొప్ప ఆనందము కలిగినది.
- శ్రీ నాగినేని లీలాప్రసాద్
- Title :Gomatha
- Author :Nagineni Leelaprasad
- Publisher :Victory Publications
- ISBN :VICTORY113
- Binding :Paperback
- Published Date :2017
- Number Of Pages :131
- Language :Telugu
- Availability :instock