• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Grahanala Katha

Grahanala Katha By Mahidhara Nalini Mohan

₹ 140

రాక్షసి పాములూ - రాహు కేతువులూ

చీనాలో శిరచ్ఛేదం:

సుమారు 4000 సంవత్సరాల క్రితం - గ్రీకులు ఇంకా నాగరికత అంటే ఏమిటో ఎరుగని కాలంలో - ఇంగ్లండులో అడవిజాతి మనుషులు రాతి ఆయుధాలు పుచ్చుకు తిరుగుతున్న రోజులలో - చైనాలో చుంగ్కాంగ్ అనే చక్రవర్తి సింహాసనం ఎక్కాడు.

రా అతడు నాలుగోవాడు. అతడి పేరు మామూలుగా అయితే ఎవరికీ గుర్తే ఉండకపోను గానీ, అతడు చేసిన ఒక పని వల్ల అతడి పేరు చరిత్రకెక్కింది. అది క్రీ.పూ.2137వ సంవత్సరంలో జరిగింది.

చైనాలో సూర్యభగవానుణ్ణి అప్పుడప్పుడు రాక్షసిపాములు మింగేస్తామని బెదిరిస్తూ వుండేవి. సూర్యుడూ, చంద్రుడూ పరాగ్గా వున్న సమయంలో అవి నోరు చార తెరచి అమాంతంగా మింగెయ్యబోయిన సందర్భాలు కూడా వున్నాయి. కానీ ఆ దేశ ప్రజలు డప్పులూ డోళ్ళూ వాయించి, పెద్ద గోల చేసి, బాణాలు వేసి, రాళ్ళు విసిరి, ఆకాశంలో అదృశ్యంగా వున్న ఆ పాముని బెదరగొట్టి తరిమేసి, సూర్యుణ్ణి విడిపించుకునేవారు. తమాషా ఏమిటంటే అవి సూర్యుడిమీద ఎప్పుడు పడితే అప్పుడు దాడి చెయ్యకుండా ఏవో కొన్ని ప్రత్యేక సమయాలు మాత్రమే వాటికి కేటాయించేవి. ఆ సమయాలను దైవజ్ఞ్యలైన జ్యోతిష్కులు ముందుగానే తెలుసుకుని, తయారుగా వుండేవారు. రాక్షసి పాముని బెదిరించి తరిమివేయడానికి అవసరమైన సమస్త ఆయుధాలతోనూ ప్రజలను సిద్ధం చేసేవారు.

దురదృష్టవశాత్తూ క్రీ.పూ.2137వ సంవత్సరం అక్టోబరు 22వ తేదీని ఒక రాక్షసి పాము చెప్పకుండా పెట్టకుండా వచ్చి సూర్యుణ్ణి మింగెయ్యడం మొదలు పెట్టింది. చక్రవర్తిగారి ఆస్థాన జ్యోతిష్కులైన హై, హో అనే ఇద్దరు పెద్దమనుషులు ఆ సంగతే తెలుసుకోకుండా తప్పతాగి పడివున్నారు. ఒకమూల సూర్యుడు క్రమక్రమంగా రాక్షసి..........................

  • Title :Grahanala Katha
  • Author :Mahidhara Nalini Mohan
  • Publisher :Vishalandra Publishing Housing
  • ISBN :MANIMN6065
  • Binding :Papar back
  • Published Date :Sep, 2024
  • Number Of Pages :137
  • Language :Telugu
  • Availability :instock