ఆవాలు చిన్నవైనా..
పిల్లి పులిని పడుతుందా? చీమ ఏనుగును పైకెత్తుతుందా? సూర్యుడి కంటే చంద్రుడు 400 రెట్లు చిన్నది. అలా ఉన్నప్పుడు చంద్రుడు సూర్యుడ్ని ఎలా మరుగు పరుస్తుంది? వాస్తవానికి సూర్యుడి వ్యాసం 13,91,980 కి.మీ. చంద్రుడి వ్యాసం 3,476 కి.మీ. మాత్రమే.
ఆకాశంలో ఎత్తున ఎగిరే విమానం ఎలా కనబడుతుందీ..? అది ఒక చిన్న పక్షి అంతమాత్రమే మన కంటికి కనబడుతుంది. నిజానికి ఆ విమానంలో 400-500 ప్రయాణీకులు ఉంటారు. ఎన్నో అంతస్థుల భవనంకన్నా అది పెద్దదైనా.. మనకు చాలా చిన్నదిగానే కనబడుతుంది.వ
దూరం పెరిగే కొలది, వస్తువుల దృగ్గోచర పరిమాణం తగ్గుతూ వుంటుందనేది. మనకు తెలుసు. సూర్యుడి కంటే... చంద్రుడు 400 రెట్లు చిన్నదే. కానీ, చంద్రుడున్న
కన్నా 00 రెట్లు దూరంలో సూర్యుడు ఉంది. అందుకే... రెండూ మన చూపుకు ఇంచుమించు ఒకే పరిమాణంలో కనబడతాయి, అంటే దాదాపు 0.5 డిగ్రీల కోణం (లేదా 30 ఆర్క్ మినిట్స్, లేదా 1800 ఆర్క్ సెకండ్స్)............
గ్రహణాలు - వినువీధిలో అద్భుతాలు