వైఫల్య తత్త్వం
Philosophy of failure:
A study on failures! (lessons on failures)
ప్రతి ఒక్కరికీ 'వైఫల్యము' జీవితములో ఒక భాగమే!
మన జీవితాన్ని రుగ్మతలనే వైఫల్యాలతోనే సాగిస్తూ మరణమనే వైఫల్యముతోనే ముగిస్తాము!
ఈ లోపల మనం చిరంజీవులమే కదా!
అంతిమ వైఫల్యము చేరే లోపల జీవితములో మనము ఆడే వ్యక్తిత్వపు క్రీడాంశాలల్లో ఎన్నో వైఫల్యాలు.. విజయాలు సరేసరి!
వైఫల్యాలు లేకుంటే విజయాలే కదా!
వైఫల్యం ఎలా కలుగుతుంది, దానిని ఎలా నివారించుకో వచ్చో ఈ పుస్తకము
ఒక అన్వయమార్గమనిపిస్తుంది..
అసాధ్య ప్రయత్నాలు ఎప్పుడూ వైఫల్యాలే అవుతాయి!
కాని నానాటికి అసాధ్యాల సంఖ్య తగ్గుతూనే ఉంది..
సాధ్యాలూ సానుకూలం కావలసిందే! అందు వైఫల్యానికి తావుండరాదు!
ఎన్నో ఎన్నో వైఫల్యాలు అన్నిటిని కాదు గాని చాలా వైఫల్యాల్ని తొలిగించుకోవచ్చు!
కొన్ని వైఫల్యాల్ని మరల్చుకోవచ్చు!
కొన్ని వైఫల్యాలకి ప్రత్యామ్నాయాల్ని ఏర్పరచుకోవచ్చు!............