₹ 30
ఎక్కడ ఏ పిల్లల్ని చుసిన అర్ధం కానీ ఆత్మీయత ! వాళ్ళతో చేరేందుకు ప్రయత్నం మొదలవుతుంది. మిగిలిన ప్రపంచం పట్ల అంతగా తోచని దగ్గరితనం పిల్లలతోనే ఎందుకో! ఇంత విశాలమైన దేశంలో ఇక్కడికే ఎందుకు వచ్చి ఆగానో నాకు మెల్లిగా అర్ధమవుతుంది. గూడెం అనుభవాలు నేను ఇన్నాళ్లు ఏమి నేర్చుకోలేదని చెబుతున్నాయి.
పసి వయసులోనే ఇక్కడ పిల్లలు చూసే జీవితాన్ని చుస్తే మనసులో ముల్లు... ఈ నెల, ఈ ఆకాశం, ఈ నీరు, ఈ ప్రకృతి అందరివీ కావా? బాల్యం కూడా అందరికి కాదా? మొలత్రాడుకి ఇంటి తాళం భద్రంగా తగిలించుకుని, పుస్తకాల సంచితో క్లాసుకొచ్చే నాలుగేళ్ళ పిల్లల్ని మీరు చూసేరా ఎప్పుడైనా?
జీవిక కోసం పరుగులు తీసే అమ్మానాన్నల్ని అర్ధం చేసుకుని వాళ్ళ బాధ్యతల్ని పంచుకుoదుకు సిద్దపడే పసివాళ్లు....! ఇలాటి బాల్యం కూడా ఒకటి ఉంటుంది...! ఉయ్యాల ఊగుతూ అమ్మ పెట్టె గోరు ముద్దలు తినే పాపాయిలకి, వీళ్లకి ఎందుకో ఇంత వ్యత్యాసం?!
- Title :Gudem Cheppina Kathalu
- Author :Nadella Anuradha
- Publisher :Chinuku Publications
- ISBN :MANIMN0800
- Binding :Paperback
- Published Date :2017
- Number Of Pages :46
- Language :Telugu
- Availability :instock