• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Guldasta Hyderabad urdu Kathalu

Guldasta Hyderabad urdu Kathalu By Mehak Hyderabadi

₹ 200

ఒక సాధూరాం కథ

-కమర్ జమాలీ

సాధూరాం క్లాత్ మిల్లులో పనిచేసే ఒక సాదాసీదా కార్మికుడు. నగరానికి దూరంగా ఎక్కడో చిన్న పల్లెలో ఉంటున్నాడు. సొంతూళ్ళో ఉన్నంతలో ఉన్నంత ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఒకసారి పనిమీద సిటీకి వచ్చిన అతను ఇక్కడి తళుకుబెళుకులు చూసి ఆశ్చర్యపోయాడు. ఆకాశహర్మ్యాలూ, ఆధునిక సౌకర్యాలూ, హంగులూ చూశాక అతనికి కళ్ళు బైర్లు కమ్మినంత పనయ్యింది. ఊళ్ళో మిగిలిన సామాన్లూ సర్దుకుని పెట్టెబేడాతో సిటీకి వచ్చేసి ఉండసాగేడు.

సాధూరాంకు మోకాళ్ళ లోతు బురదలో పనిచేయడం సుతరామ ఇష్టం లేదు. ఊళ్ళో ఉన్నపుడే అతను చాలా నీట్గా ప్యాంటు, షర్టూ వేసుకుని బయటకు అడుగుపెట్టాడంటే చాలు...కుర్రాళ్ళంతా 'జంటిల్మేన్'... 'జంటిల్మేన్' అంటూ అతని చుట్టూ తిరిగేవారు. లండన్ నుంచి ఇండియాకు వచ్చి మొదట ఇక్కడే అడుగుపెట్టినట్లుగా వారంతా అతన్ని చాలా ఆశ్చర్యంగా ఎగాదిగా చూసేవారు!

ఊళ్ళో స్నేహితులంతా ములగ చెట్టు ఎక్కిస్తూ పొగడడంతో అతను నిజంగానే ఊహల్లో తేలియాడసాగేడు. తన పేగుబంధం ఈ ఊరితోనే ముడిపడి ఉందన్న సంగతి అతను మర్చిపోయాడు. పేడ కంపు వ్యాపించిన పల్లెలోనే తన తల్లి తనకు జన్మనిచ్చిన సంగతి కూడా అతను గుర్తుపెట్టుకోడు.

ఇంట్లో అన్ని విషయాలూ అతనికి చాలా అసహ్యంగా అనిపిస్తాయి. ఆ అసహ్యం ఏస్థాయికి చేరిందంటే... ఇంట్లోకి వెళ్ళేటప్పుడు చెప్పులు పాడైపోతాయన్న భయంతో బయట గుమ్మం దగ్గరే వదిలేస్తాడు! దొడ్లో మురికి అంతా కాళ్ళకు................

  • Title :Guldasta Hyderabad urdu Kathalu
  • Author :Mehak Hyderabadi
  • Publisher :Mehak Prachuranalu
  • ISBN :MANIMN4894
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :202
  • Language :Telugu
  • Availability :instock