• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Gunde Jabbula Nivarana-Chikistcha

Gunde Jabbula Nivarana-Chikistcha By Dr.Jujuri Sriman Narayana

₹ 100

 ఈ గ్రంథంలో....

          గుండెకు సంబంధించిన వ్యాధులు, వ్యవహారంలో ఉన్న ఆయా రుగ్మతలు అనేకం. స్ట్రోక్, హార్ట్ ఎటాక్, గుండెనొప్పి, అధిక రక్తపోటు, గుండెపోటు, గుండె దడ, గుండె పెరుగుదల, గుండె జబ్బు మొదలైన పలు గుండె జబ్బులను పూర్తిస్థాయిలో సవివరంగా తెలియజేయడమే కాకుండా వాటి చికిత్సా విధానాలు స్పష్టంగా చెప్పారు. చికిత్స ఏ విధంగా ఉంటుంది? అనంతరం జీవనవిధానంలో ఏ ఏ మార్పులు అవసరమో చెప్పారు. ప్రతి గుండె సంబంధిత వ్యాధికి ప్రథమ చికిత్స ఎలా చెయ్యాలో వివరించారు. కృత్రిమ పరికరాలను ఎట్టి పరిస్థితులలో అమర్చవలసి వస్తుందో, గుండె నిర్మాణంలో లోగుట్టులను, గుండె సంరక్షణకు ఆహారానికి గల సంబంధాన్ని తేటతెల్లం చేశారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల గురించి విపులంగా ప్రస్తావించారు. ఆహారంలో కొవ్వు పదార్ధాల స్థానం ఎంతో చెప్పారు. దైనందిన జీవితంలో మధుపానం, ధూమపానంలతో గుండెకు ఎంతటి హాని జరుగుతుందో వివరించారు.

          డా. శ్రీమన్నారాయణ గారు చిరకాలం నుంచి గుండె జబ్బులకు నాణ్యమైన చికిత్సలు అందించడంలోనే కాదు, ఎప్పటికప్పుడు వైద్య రంగంలో ప్రవేశిస్తున్న గుండె వ్యాధులకు సంబంధించిన అధునాతన చికిత్సలను చేయడంలో, చికిత్సానుభవంతో పరిశోధనలు చేయడంలో ఘనపాటి. ఈ కోణంలో ఈ గ్రంథం ఎంతో ప్రామాణికమైందని ఘంటాపధంగా చెప్పవచ్చు. యావన్మందికి ఈ గ్రంథం గుండె ఆరోగ్యం పట్ల సమగ్రమైన అవగాహన కలిగించడమే కాదు, ఒక రిఫరెన్స్ పుస్తకంగా రాణిస్తుందని ఆశిస్తున్నాను.

  • Title :Gunde Jabbula Nivarana-Chikistcha
  • Author :Dr.Jujuri Sriman Narayana
  • Publisher :Sree Shanmukheswari Prachuranalu
  • ISBN :MADHUPRA08
  • Binding :paparback
  • Published Date :2015
  • Number Of Pages :187
  • Language :Telugu
  • Availability :instock