• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Gundu Bhimanna Kathalu

Gundu Bhimanna Kathalu By Katha Prapancham

₹ 200

కూలి డబ్బులు

ఒక ఊళ్లో భీమన్న అనే కుర్రాడుండేవాడు. వాడికి చిన్నతనంలోనే తల్లీ, తండ్రి పోవటం చేత వాణ్ణి బామ్మ గారాబంగా పెంచి పెద్ద చేసింది. భీమన్నకు తెలివి తేటలూ, లోక జ్ఞానమూ కొంచెం కూడా లేవు, కాని వాడిది అంతులేని బలం. వాణ్ణి అందరూ గుండు భీమన్న అని పిలిచేవాళ్ళు. వాడికి కొంచెం కూడా చదువు రాలేదు. అటువంటి వాడు గాలికి తిరిగేకన్న ఎక్కడైనా పనికి కుదిరితే కాస్త బాగుపడతాడనే ఉద్దేశంతో బామ్మ వాణ్ణి వెళ్ళి ఎక్కడైనా పని చూసుకోమని చెప్పింది.

పనికోసం వెళ్లినప్పుడు ఎలా మసులు కోవాలో బామ్మ గుండు భీమన్నకు ఈ విధంగా బోధించింది. "మాట్లాడక పని చేసి, పోట్లాడక కూలి పుచ్చుకో. అలా చేసే వాళ్ళనే లోకం మంచి వాళ్లుగా తెలుస్తుంది. చేసే పని బాగా చెయ్యి, పుచ్చుకునే డబ్బు చేతి నిండా పుచ్చుకో. నేను చెప్పిన మాటలు మరిచిపోవు గద!"

బామ్మ చెప్పిన సలహా వాక్యాలు మననం చేసుకుంటూ గుండు భీమన్న పని కోసం ఊరి వెంట బయలుదేరాడు. దారిలో ఒక ఇంటి ముందు వాడికొక పెద్ద మనిషి కనపడ్డాడు. వాడు ఆయనను, "నేను పనికోసం వెతుకుతున్నాను. నాకు మాట్లాడక పని, పోట్లాడక కూలీ ఇచ్చే వాళ్ళు కావాలి. ఎవరన్నా ఉంటే చూపిస్తారా?" అని అడిగాడు..........................

  • Title :Gundu Bhimanna Kathalu
  • Author :Katha Prapancham
  • Publisher :Katha Prapancham
  • ISBN :MANIMN6146
  • Binding :Papar back
  • Published Date :2024
  • Number Of Pages :112
  • Language :Telugu
  • Availability :instock