• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Guntur Jilla Devalayalu Charitra

Guntur Jilla Devalayalu Charitra By Piduguralla Nararjuna Konda Pichaiah

₹ 75

గుంటూరు జిల్లా దేవాలయాలు - చరిత్ర

  1. విజయపురి

క్రీ.శ. 3వ శతాబ్దములో ఆంధ్రదేశము నేలిన ఇక్ష్వాకుల రాజధాని 'విజయ పురి', ధరణికోట రాజధానిగా ఆంధ్రదేశము నేలిన చివరి శాతవాహన చక్రవర్తులలో నొకడగు 'విజయశాతకర్ణి' యీ నగరమును శ్రీపర్వతలోయలో నిర్మించియుండును'. అందుచే అది అతని పేరుతో వ్యవహించబడెనని చరిత్రకారుల అభిప్రాయము. విజయశాతకర్ణి (క్రీ.శ. 196 - 202) తన 6వ పాలనా సం||లో వేయించిన బ్రాహ్మీ లిపిలోని ప్రాకృత భాషాశాసనం యిచట లభించినది. ఈ లోయలో లభించిన శాసనములన్నింటిలోనికి ఇదియే మిక్కిలి ప్రాచీనమైనది. విజయపురి లోయ 16°31' ఉ.అ, 79°15′ తూ.రే రేఖలపై గుంటూరు జిల్లా, పల్నాడు తాలూకాలో కృష్ణానది తూర్పు తీరమున నున్నది. విజయ పురి మూడు వైపులా నల్లమల కొండలు, ఒకవైపు కృష్ణానది చే

పరివేష్ఠించబడియున్నది. నల్లమల పర్వతము యిచట శ్రీపర్వతముగా పేర్కొనబడుచున్నది. విజయపురిలోయ ప్రాచీన శిలాయుగం అనగా 200000 సం॥ల పూర్వము నుండి క్రీ.శ. 18వ శతాబ్దము వరకూ మానవా వాసముగనుండి వివిధ నాగరికతలకు కేంద్రముగనున్నది. దక్షిణ భారతదేశమంతటిలోను అత్యంత.................

  • Title :Guntur Jilla Devalayalu Charitra
  • Author :Piduguralla Nararjuna Konda Pichaiah
  • Publisher :Nararjuna Konda Pichaiah, Piduguralla
  • ISBN :MANIMN4295
  • Binding :Papar back
  • Published Date :March, 2016
  • Number Of Pages :216
  • Language :Telugu
  • Availability :instock