విద్యాభ్యాసం
గురు రవిదాస్ విద్య నేర్చుకునే సమయంలో మనువాద ఆచరణ కారణంగా ఆయనకు సరియైన విద్యపొందే అవకాశం లేక పొందలేదు. అయినా ఆయన సాధు సంతు బిక్కు మొదలగు వారి దగ్గర భాషా జ్ఞానాన్ని సంపాందించారు. "డా॥ కులవంత్ కార్తీ" అప్పుడే ఈ విషయంరాసిండు. సంత్ గురు రవిదాస్ గారి భాష త్రివేణీ సంగమం. ఆయన నేర్చిన హిందీ, సంస్కృతభాషలు గంగానది వంటివి. అరబీ - పారసీ భాషలు యమున (జమున) నదిలాంటివి. అవధి (బ్రెజ్ భాష) వజ్ర భాష ఖడిటోలీ పంజాబీ భాషలు సరస్వతీ నది లాంటివి. గంగ యమున సరస్వతి నదులు కలిసి త్రివేణీ సంగమం అయినట్టె ఆయన నేర్చిన భాషలన్నీ కలిసి త్రివేణీ సంగమంగా మారాయని స్పష్టమవుతున్నది. రవిదాసు చాలా భాషల జ్ఞానం ఉన్నది. జ్ఞాని గురుచరణ్ సింగ్ వైద్ పంత్ ప్రకాశ్ పత్రిక ఆధారంగా (పంత్ ప్రకాశ్ పత్రిక న్యూఢిల్లీ 23 ఫిబ్రవరి 1869) అనుసారంగా గురు రవిదాస్ ప్రకాశ్ గ్రంథం "గురుముఖం" లిపిలో రవిదాస్ గారి జననం సాఖీ (కృతిని అతను స్వయంగా రాసుకున్నడు. కొంత భాగంతోటి వారి గురించి రాయబడింది. ప్రస్తుత జిల్లా బోధియానాలో రవిదాస్ యొక్క శిష్యుడు అయిన ఒక మహంత్ దగ్గర ఆ కృతులు నేటికీ అందుబాటులో ఉన్నవి. ఇతని జనన "సాఖీ" పై పకీర్లలలో జగడం (వివాదం) వుండింది. అందుకే లాహెరారు. హైకోర్టు మహమ్మదీయ జడ్జి వివాదంపై తీర్పు వెలువరించాడు. ఇతనికి హిందువుల ఆధ్యాత్మిక గ్రంథాల పరిచయం ఉండింది. అనేందుకు అతని యొక్క “వాణి” నిదర్శనం ఇదేగాకుండా అతని యొక్క సంపూర్ణవాణి ద్వారా నిర్ధారణ యేమిటంటే బుద్ధ భగవాన్ దర్శనం అయిందని దీనితో పాటు అతనికి ఆ సమయంలో తీవ్రంగా అభివృద్ధి ప్రచలిత అవుతున్న ముస్లిం మతంపై కూడా ఆయనకు జ్ఞానం ఉందన్న విషయం అయినా ఇంత జ్ఞానం కలిగిన వారు నిరక్షరాస్యుడు కాదు. ఎందుకంటే ఎంతోమంది విద్వాంసుల యొక్క అన్వేషణను మన ముందు ఉంచాడు. కనుక ఆయన అప్పటికి అందుబాటులో ఉన్న జ్ఞానియైన బ్రాహ్మణునికన్న ఎక్కువ జ్ఞానము కలిగియున్నాడని మనము అనుకోవాలి. ఆనాడు బ్రాహ్మణులే ఆయనను జ్ఞానానికి ఇనుము లాంటివాడు. కాదని ఉద్భోదించారు. ఆ కాలంలో ఇతని ఖ్యాతి విద్వత్తు -ప్రతిష్ట పెరిగిపోయిన స్థితి ఉండింది కనుక వాళ్ళు అలా అన్నారు. అందుకని గురువైన సంత్ రవిదాస్ గారిని నిరక్షరాస్యుడు అనడం ఉచితం కాదు.
మూలం: స్వరూప్ చంద్ర బౌద్ధ అనువాదం: పట్నం వెన్నయ్య.................