• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Guruvandanam 2022

Guruvandanam 2022 By Acharya Tangirala Venkata Subbarao

₹ 720

“దైవం మానుషరూపేణ” - గురువర్యులు

ఆచార్య తిమ్మావజ్ఝల కోదండరామయ్యగారు
 

(1926-1981)

శా. “చిమ్మౌ చీఁకటిఁ జిక్కియున్న నను నాశీశ్శారదజ్యోత్స్నలో
      నిమ్మౌ చోటుకుఁ జేర్చి, బాధ్యతగ నన్నీపీఠమెక్కించి, పా
      ల్గుమ్మల్ పొంగు నదృష్టమిచ్చిన బుధున్ 'కోదండరామా'ఖ్యు,మా
      తిమ్మావజ్ఝల సద్గురుం దలఁతు భక్తిన్ భుక్తిఁగొన్వేళలన్!”

నాకు దైవం ప్రత్యక్షం కాలేదు. కాని గురువర్యులు ఆచార్య తిమ్మావజ్ఝల కోదండరామయ్యగారి రూపంలో మాత్రం నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడని గట్టిగా చెప్పగలను. బెంగుళూరు విశ్వవిద్యాలయంలో నేను తెలుగు ఉపన్యాకునిగా చేరి స్థిరపడటానికి శ్రీవారే ముఖ్యకారకులు. వీరు వేటూరి ప్రభాకరశాస్త్రిగారి ప్రియశిష్యులు. పరిశోధనలో గురువుతో సమానమైన అంతేవాసులు!

నేను 1961 జూన్-జూలై మాసాలలో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏ. లో చేరాను. అప్పుడు శ్రీ జీరెడ్డి చెన్నారెడ్డిగారు మా శాఖకు అధ్యక్షులుగా ఉండేవారు. కొన్ని నెలల తరువాత, మద్రాసులోని సర్ త్యాగరాయ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా ఉన్న శ్రీ తిమ్మావజ్ఝల కోదండరామయ్యగారు మా శాఖకు రీడరుగా నియమితులై వస్తున్నారని తెలిసింది. అంతకు ముందే నేను 'భారతి' మాసపత్రికలో వారి వ్యాసాలను చదువుతూ ఉండేవాణ్ణి, ఆ పరోక్ష పరిచయాన్ని పురస్కరించుకొని వారికి ఒక కార్డు వ్రాశాను. నన్ను ఆశీర్వదిస్తూ వెంటనే ప్రత్యుత్తరమిచ్చారు. కోదండరామయ్యగారు తిరుపతి ఓరియంటల్ కళాశాలలో చదువుతున్నప్పుడు చెన్నారెడ్డిగారి శిష్యులట! "నన్ను............

  • Title :Guruvandanam 2022
  • Author :Acharya Tangirala Venkata Subbarao
  • Publisher :Acharya Tangirala Venkata Subbarao
  • ISBN :MANIMN4357
  • Binding :papar back
  • Published Date :2023
  • Number Of Pages :575
  • Language :Telugu
  • Availability :instock