• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Halla Bol

Halla Bol By Sudhanva Deshpande

₹ 300

ప్రచురణకర్తల మాట

ప్రజాకళలకు దారిదీపం

సస్టర్ హష్మీ

సప్టర్ హష్మీ వీధినాటిక దార్శనికుడు. రంగస్థల కళాకారులకేగానీ, ఇతరేతర కళాకారులకే గానీ వీధినాటిక అంటే చిన్నచూపు. వీధినాటిక అంటే నినాదాలకు ఎక్కువ, డ్రామాకు తక్కువ అని చప్పరించే వాళ్ళు. ఇదేం కొత్తా! ఇంతకు ముందు మన దగ్గర చిందు భాగోతాలు, హరికథలు రోడ్డు మీద ఆడేవాళ్లు కదా... దీనికే ఇంత గొప్పలా? అని తేలిగ్గా తీసి పారేసేవాళ్ళూ ఉన్నారు. హరికథలు, బుర్రకథలు, చిందు భాగోతాలు ఇవన్నీ పురాణాలు, ఇతిహాసాలు ఇతివృత్తంగా సాగేవి. మా భూమి, పోతుగడ్డ, ముందడుగు వంటి నాటకాలు నాజర్ బుర్రకథ వీటికి మినహాయింపు.

వీధినాటిక ఇతివృత్తం సామాజిక జీవితం. అందుకే వీధినాటిక కేవలం ప్రయోగంగా మిగిలిపోలేదు. అలాగే వీధి నాటికను సప్లర్ హషీ ప్రయోగాత్మకంగా ముందుకు తీసుకురాలేదు. అనివార్యమైన పరిస్థితులలో తెచ్చిన ఆలోచనే తప్ప వీధినాటిక తన మేధో ఆవిష్కరణ అని సప్టర్ హష్మీ ఏనాడు చెప్పలేదు.

దేశంలో ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం పలుకుబడి వేగంగా దిగజారిపోతూ, మరోపక్క నుండి ప్రతిపక్షాలలో ఐక్యత నెలకొంటున్న తరుణంలో ఇందిరాగాంధీ | ఎమర్జెన్సీ విధించారు. ప్రజాతంత్రవాదులు, అభ్యుదయ శకులు, వామపక్షాల మీద తీవ్ర నిర్బంధం మొదలయ్యింది. కార్మిక సంఘాలు ప్రజాసంఘాల కార్యకలాపాలు స్థంభించిపోయాయి.......

  • Title :Halla Bol
  • Author :Sudhanva Deshpande
  • Publisher :Prajashakthi Book House
  • ISBN :MANIMN3480
  • Binding :Paerback
  • Published Date :July, 2022
  • Number Of Pages :295
  • Language :Telugu
  • Availability :instock