• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Hamsa Vimshathi
₹ 999

హంస వింశతి

ప్రథమాశ్వాసము

భావదీపిక

అవతారిక

శ్రీరామ స్తుతి

శ్రీరామ స్తుతి :

శ్రీరామాంశజయైన జానకి యురస్సీమాంత రాత్యంత వి

స్తార ప్రోజ్వల హార నాయకమణీ సందర్శితంబౌ నిజా
కారం బారసి యన్యకాంత యను శంకం జెందునంచెంచి, త
న్నారీరత్నము నంకపీఠినిడు సీతాభర్త నన్ బ్రోవుతన్

భావదీపిక

శ్రీ హయగ్రీవాయ నమః

సర్వాంధ్ర జనసేవాయై సరళీకృత భాషయా।

హంసవింశతి కావ్యస్య లిఖ్యతే భావదీపికా॥

భావము : శ్రీదేవి అవతారమే సీత. “రాఘవత్వే భవత్సితా రుక్మిణీ కృష్ణ జన్మని." శ్రీమన్నారాయణుడు రాముడుగా పుడితే ఆమె సీతగా పుట్టింది. ఆయన కృష్ణుడుగా పుడితే ఆమె రుక్మిణిగా అవతరించింది. ఆయనను ఆమె అరక్షణం కూడా విడిచి వుండనే వుండదు.

ఈ పద్యంలో సీత రాముడి వామాంకంపై - అంటే ఎడమ తొడపై కూర్చోవడాన్ని కవి అయ్యలరాజు నారాయణామాత్యుడు ఎలా చమత్కరించాడో చూద్దాం !....................................